పంటలు పాడై.. అప్పులు భారమై..!

0
20
  • ఐదుగురు అన్నదాతల ఆత్మహత్య  
  • మృతుల్లో దంపతులు
  • వికారాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌ జిల్లాల్లో ఘటనలు 

బోథ్‌ రూరల్‌, కుంటాల, నల్లబెల్లి : ఓ వైపు వర్షాలతో పాడైన పంటలు… మరోవైపు పెరిగిపోతున్న అప్పులు… దీంతో తీవ్ర మనో వేదనకు గురై రైతు దంపతులతో పాటు మరో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు వికారాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌ జిల్లాల్లో సోమవారం జరిగాయి. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండ లం తిమ్మాపూర్‌లో జిల్లెల యాదయ్య(40), యాదమ్మ(35) దంపతులు తమకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే వీరు పంటలు పోయి, అప్పులు పెరిగి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఘటనలో అప్పులు చేసి సాగు చేసిన పత్తి, సోయా పంటలు వర్షాలకు పాడవడంతో ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలం కౌఠ(బి)కి చెందిన రైతు ఎడ్మల (ఇట్టెడి) రమణారెడ్డి (52) పురుగు మందు తాగాడు. అలాగే, నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం రాజాపూర్‌ తండాకు చెందిన జితేందర్‌(45), వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన కీసరి సాయిలు (58) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 

Leave a Reply