చాక్లెట్‌ ఆశజూపి నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి

0
383
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • రాజీకి కళాశాల నిర్వాహకుల యత్నం ?

 మాదాపూర్‌ : చాక్లెట్‌ ఇస్తానంటూ పిలిచి.. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ కళాశాలలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దంపతులు మాదాపూర్‌లోని కాలేజీ మెస్‌లో పనికి కుదిరారు. ప్రతి రోజు కుమార్తెను తమతో పాటు మెస్‌కు తీసుకెళ్లేవారు. రెండు రోజుల క్రితం వంటమనిషి అంజయ్య చాక్లెట్‌ ఆశజూపి బాలికపై లైంగిక దాడి చేశాడు. కళాశాల నిర్వాహకులు హడావుడిగా బాలికను ఆస్పత్రికి తరలించారు.

ఈ పరిస్థితుల్లో ఎంఎల్‌ఎ్‌స(మెడికో లీగల్‌ సర్వీ్‌స)ను నమోదు చేసి వైద్యం అందించి, పోలీసులకు సమాచారమివ్వాల్సిన వైద్యులు అలా చేయలేదు. కళాశాల నిర్వాహకులతో కుమ్మకై మాత్రలు రాసి ఏం ఫర్వాలేదని చెప్పి బాలికను తల్లిదండ్రులతో పంపించేశారు. పది లేదా ఇరవై వేలు తీసుకొని విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కళాశాల నిర్వాహకులు కూడా సూచించారు. అయినా ప్రలోభాలకు లొంగని బాలిక తల్లిదండ్రులు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అంజయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply