అక్కాచెల్లెళ్ళపై 8 మంది కామందుల లైంగికదాడి ఇద్దరు మైనర్లే

0
264
హైదరాబాద్ : కరోనా కాలంలోనూ మైనర్‌ బాలికలపై లేన్గికదాదులు ఏ మాత్రం ఆగట్లేదు. 8 మంది కామాంధులు ఇద్దరు అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్వెయంగా వెలుగులోకి వచ్చింది.  అక్క వయసు 16 సంవత్సరాలు, చెల్లెలి వయసు 14 సంవత్సరాలు వీరిద్దరూ  బలోదాబజార్‌ ప్రాంతంలో నివశిస్తున్నారు.

వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఇంటికి వస్తుండగా, 8 మంది యువకులు వారిపై దాడి దిగి, తోటి స్నేహితులను బెదిరించి వెళ్ళగొట్టారు. అక్కచెల్లెళ్లిద్దరినీ ఎత్తుకెళ్లి వారిపై లైంగికదాడి చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. వారి బెద్రిమ్పులకి బయపడి ఆ బాలికలు ఎవరికీ చెప్పుకోలేకపోయారు. గత రెండు రోజుల క్రితం ఇద్దరిలో ఓ బాధితురాలు మహిళా, శిశు అభ్యున్నతి శాఖను ఆశ్రయించింది. తనపై రెండు నెలల క్రితం వారిపై  లైంగికదాడి జరిగిన సంగతి, తనతో పాటు తన సోదరిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారని విలపించుకుంది.  దాడి చేసిన దగ్గరినుండి మమ్మలి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, లైంగికదాడి చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు మొత్తం 11 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసుల సమాచారం.

Leave a Reply