ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోనే వదిలేశారు..!!

0
334

మహబూబాబాద్‌ రూరల్‌ : అప్పుడే పుట్టిన ఆడశిశువును అనాథగా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన ఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఓ వృద్ధురాలు శిశువును ఆసుపత్రిలోని నవజాత శిశువు కేంద్రానికి తీసుకెళ్లింది. తల్లి ఏదని అడగడంతో తన కుమార్తె కింద ఉందని చెప్పి శిశువును వారికి అప్పగించి కిందికి వెళ్లి తిరిగి రాలేదు. 11 గంటలైనా ఎవరూ రాకపోవడంతో వైద్యుడు జగదీశ్వర్‌ ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏసీడీపీవో ఎల్లమ్మ, సూపర్‌వైజర్‌ ఉషారణి ఆసుపత్రికి వచ్చారు. శిశువు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వారం రోజుల పాటు వెంటిలెటర్లో ఉంచాలని వైద్యులు తెలిపారు. ఆడపిల్ల పుట్టిందని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారని.. శిశువు ఆరోగ్యం మెరుగుపడాక బాలల సరరక్షణా కమిటీ ముందు హాజరుపరిచి శిశుగృహ కేంద్రానికి తరలిస్తామని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఉషారాణి తెలిపారు. ఛైౖల్డ్‌లైన్‌ సభ్యులు ఉమారాణి, ఉపేందర్‌, అంగన్‌వాడీ టీచర్‌ పుష్ప ఉన్నారు.

Courtesy Eenadu

Leave a Reply