ఏ తల్లి కన్న బిడ్డో..ముళ్లపొదల్లో ఆడశిశువు

0
68
  • మహబూబాబాద్‌ జిల్లా బూరుగుపాడులో లభ్యం
  • ఇంక్యుబేటర్‌ బాక్స్‌లో ఉంచిన వైద్యులు

డోర్నకల్‌ : ఏ తల్లి కన్న బిడ్డో.. కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే.. ముళ్లపొదల్లో చిక్కుకొని ఆ పసిగుడ్డు గుక్కపెట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలో ఈ దారుణం బయటపడింది. బూరుగుపాడు గ్రామం కొత్తబజార్‌కు చెందిన ఏర్పుల వెంకటలక్ష్మి అనే మహిళ.. తన ఇంటి వెనక ఉన్న చెట్ల పొదల్లో శిశువు ఏడుపు వినిపించటంతో ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పింది. వారంతా వెళ్లి చూడగా.. ముళ్లపొదల్లో ప్లాస్టిక్‌ కవర్లపై ఏడుస్తూ పడివున్న ఆడశిశువు కనిపించింది.

ఒంటినిండా రక్తంతో ఉన్న ఆ నవశిశువును ఆమె అక్కున చేర్చుకుంది. ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించింది. విషయం తెలుసుకున్న స్థానిక అంగన్వాడీ టీచర్‌ హైమావతి  ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. వారి ఆదేశాల మేరకు శిశువును డోర్నకల్‌ పీహెచ్‌సీకి తరలించారు. ఆ శిశువును తీసుకెళ్లి సంరక్షిస్తామని బాలల సంరక్షణాధికారులు తెలిపారు.

Courtesy Andhrajyothi

Leave a Reply