వర్షంలో రోడ్డు పక్కన ఆడ శిశువు

0
51

గుమ్మడిదల/సంగారెడ్డి అర్బన్‌ : అప్పుడే పుట్టి ఈ ప్రపంచంలోకి వచ్చింది ఆ ఆడ శిశువు. ఈ పసిగుడ్డును పెంచి, పెద్ద చేసే స్తోమత తమకు లేదనో, ఆడ బిడ్డ అన్న వివక్షో, మరే కారణం చేతనో.. మానవత్వం లేకుండా వర్షంలో, రోడ్డుపక్కన పడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆ శిశువు ఆకలి బాధతో గుక్కపట్టి చాలా సేపు ఏడ్చింది. చల్లటి వాతావరణంలో వదిలి వెళ్లడం వల్ల శిశువు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడింది. ఈ హృదయవిదారక ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ మహిళ ఆ శిశువును గమనించి స్థానికుల సాయంతో ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించింది. ఆయన అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకుని ఆడ శిశువుకు వారు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుమ్మడిదల మైత్రీ ఫౌండేషన్‌ అంబులెన్స్‌ సహకారంతో సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply