6 మాసాలుగా బాలికపై లైంగిక దాడి

0
115
  • నగ్న వీడియోతో బ్లాక్‌మెయిలింగ్‌
  • ఆపై సోషల్‌ మీడియాలో షేరింగ్‌
  • టీఆర్‌ఎస్‌ నేత కుమారుడి నిర్వాకం
  • అతనితో పాటు మరో యువకుని అరెస్టు
  • పరారీలో మరో నలుగురు బాలురు

చిలుపూర్‌ : ఆ యువకుడు ఓ టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు.. ఓ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు… సెల్‌ఫోన్‌లో నగ్న వీడియోను రికార్డు చేసి, దాన్ని చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ వీడియోను మరో ఐదుగురు స్నేహితులతో కలిసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌ కావడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనలో నిందితుడితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మరో నలుగురు పరారీలో ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ దురిశెట్టి రఘుచందర్‌ కథనం మేరకు.. జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు కుమారుడు గుర్రపు శ్యాం అదే గ్రామానికి చెందిన ఓ బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ బాలికను నగ్నంగా వీడియోలో చిత్రీకరించాడు. దాన్ని చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల తన స్నేహితులైన సాంబరాజుతో పాటు, మరో నలుగురు బాలుర సాయంతో ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్రపు శ్యాం, సాంబరాజును పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మిగతా నలుగురు బాలురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.

Leave a Reply