వాట్సాప్‌ గ్రూపుల్లో విద్యార్థినుల న్యూడ్‌ ఫొటోలు !

0
123
  • మార్ఫింగ్‌ చేసి వేధింపులు..బ్లాక్‌ మెయిలింగ్‌
  • భగ్గుమన్న వీబీఐటీ కళాశాల విద్యార్థులు..ఆందోళన

ఘట్‌కేసర్‌ రూరల్‌ : విద్యార్థినుల ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి, వాట్సాప్‌ గ్రూపుల్లో పెడుతూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గురువారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్‌ కళాశాల (వీబీఐటీ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి కళాశాలకు చెందిన విద్యార్థినుల వాట్సాప్‌ డీపీల నుంచి ఫొటోలు సేకరించి.. తిరిగి వాటిని న్యూడ్‌ ఫొటోలుగా మార్ఫింగ్‌ చేసి వారికే పంపిస్తూ, వాట్సాప్‌ గ్రూపుల్లో పెడుతున్నాడని వాపోయారు. ఈ విషయమై గతడాది నవంబరు 4న హాస్టల్‌ వార్డెన్‌కు, 9న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న ఎన్‌ఎ్‌సయూఐ, యువజన కాంగ్రెస్‌ నేతలు గురువారం ఉదయం కళాశాల గేటు ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ నేత సామ రామ్మోహన్‌రెడ్డి ఆఽధ్వర్యంలో విద్యార్థులు కళాశాల గేటు ఎదుట బైఠాయించారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది నవంబరు నుంచి తమ ఫొటోలను మార్పింగ్‌ చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని మల్కాజ్‌గిరి ఏసీపీ నరే్‌షరెడ్డి తెలిపారు.

Leave a Reply