‘ఉమ్మడి జాబితా’ అధికారాలు రాష్ట్రాలకే!

0
282
  • అధికార వికేంద్రీకరణతోనే ఆర్థికాభివృద్ధి
  • రాష్ట్రాల్లో పెట్టుబడులకు స్వేచ్ఛ ఇవ్వాలి
  • కేంద్ర ప్రభుత్వ నియంత్రణలు వద్దే వద్దు
  • ఆర్థికంగా దేశాన్ని నడిపిస్తోంది పట్టణాలే
  • తెలంగాణలో అద్భుత పారిశ్రామిక ప్రగతి
  • టీఎ్‌సఐపా్‌సతో 12 లక్షల మందికి ఉపాధి
  • ప్రపంచ ఆర్థిక సదస్సులో కేటీఆర్‌ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని, కలిసి పనిచేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలతో రాజ్యాంగం ప్రత్యేక అధికారాలను కల్పించిందని, మారిన పరిస్థితుల రీత్యా ఉమ్మడి జాబితాలో ఉన్న అధికారాలను, అంశాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని అన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌) ‘ఇండియా ఎకనామిక్‌ సమ్మిట్‌’ పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధికార వికేంద్రీకరణ జరిగిందని, పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచామని, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని వివరించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఇప్పటికీ దేశం పల్లెల్లోనే నివసిస్తున్నదని, అయితే ఆర్థికంగా దేశాన్ని నడిపిస్తున్నది నగరాలు, పట్టణాలేనని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మరిన్ని ఉన్నత అవకాశాల కోసం ప్రజలు పట్టణాల వైపు చూస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ, పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల సంక్షోభం తలెత్తుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పెట్టుబడుల కొరత ఉందన్నారు. అయితే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణల వల్ల అవి స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయని వివరించారు. ఈ అంశంలో కేంద్రం రాష్ట్రాలకు సహాయకారిగా నిలవాలి తప్ప అడ్డుకాకూడదని, సరళీకృతమైన నిబంధనలతో కేంద్రం ముందుకు రావాలని కోరారు. అప్పుడే పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో అద్భుత పారిశ్రామిక ప్రగతి
ఐదున్నరేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తోందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎ్‌సఐపాస్‌ చట్టం అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటి వరకు 11 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, అందులో 8400 పైగా కార్యరూపం దాల్చాయని వివరించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందన్నారు. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో తెలంగాణ రెండు సార్లు అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. అనేక విధానాలు నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అసలైన కార్యాచరణ క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిపూర్వక నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశముందనడానికి తెలంగాణే ఒక ఉదాహరణ అన్నారు. మరోవైపు సదస్సుకు వచ్చిన పలు సంస్థల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వాన
Courtesy Andhra Jyothy..

Leave a Reply