న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మళ్లీ దేశభక్తుడిగా అభివర్ణించారు. బుధవారం లోక్‌సభ లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యతో విపక్షా లు మండిపడ్డాయి. గాంధీని తాను ఎందుకు చంపానో గాడ్సే చెప్పిన కారణాలను డీఎంకే నేత ఎ.రాజా ప్రస్తావించగా ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుపడ్డా రు. దేశభక్తుడి ఉదాహరణను చెప్పొద్దన్నారు.
Courtesy AndhraJyothy...