ఈ తాత ప్రేమ వెల ఎంత?

0
201
బినామీల పేరిట ఆస్తులు… కంపెనీలు
తరువాత ఆమెకు చెందేట్లు వీలునామాలు
వందల కోట్ల ఆస్తులు దక్కేట్లు స్కెచ్‌
చిదంబర రహస్యాల్లో చీకటి కోణాలెన్నో

ఒక వ్యక్తి భారీగా అవినీతికి పాల్పడ్డాడని వ్యాఖ్యానించడం చాలామందికి ఓ అలవాటుగా మారింది. ఫ్యాషనైపోయింది. నోటికొచ్చిన ఆరోపణలన్నీ చేస్తున్నారు. ఇది ఆశించిన లక్ష్యాన్ని సాధించకుండా అడ్డుపడుతుంది. వేస్టవుతుంది.
పి చిదంబరం, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి

తాత ఆస్తులు మనవలకు. తండ్రి ఆస్తులు పిల్లలకు. ఇది లోకరీతి. నిజాయతీగా సంపాదించిన డబ్బు అయితే ఎవరి హక్కులు వారికి దర్జాగా సంక్రమిస్తాయి. అక్రమాస్తులైతే.. నదులు సముద్రంలో చేరినట్టు ఎక్కడో మొదలైన నిధుల ప్రవా హం రకరకాల మలుపులు తిరిగి చివరికి చేరాల్సిన చోటుకు చేరుతుంది. బుధవారం సీబీఐ అరెస్టు చేసిన చిదంబరం జీవితంలోనూ అలాంటి ‘మలుపుల’ కథ ఒకటుంది. ఆ కథకు మూలం చిదంబరం అయితే.. అక్రమాస్తుల చివరి గమ్యం ఆయన మనవరాలు అదితి.

ఏడాదిన్నర క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ భాస్కర్‌ రామన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసిం ది. ఆయన ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌. ఈ అరెస్ట్‌ ఎందుకు జరిగిందనే ప్రశ్నకు సమాధానం కావాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలి. 2015 డిసెంబరులో ఈడీ ఆయనకు చెందిన ఓ లాకర్‌ను బలవంతంగా తెరిపించింది.అందులో 4 వీలునామాలు కనిపించాయి. అవి నలుగురికి చెందినవి. వారు: భాస్కర్‌ రామన్‌, సీబీఎన్‌ రెడ్డి, రవి విశ్వనాఽథన్‌, పద్మా విశ్వనాథన్‌. అవన్నీ ఒకేరోజున (2013 జూన్‌ 19న) రాసినవి. అన్నింటికీ సాక్షి ఒక్కడే.. వి.మురళి అనే వ్యక్తి. మూడింటిలో రెండో సాక్షి గా చిన్నబాల నాగేశ్వరరెడ్డి(సీబీఎన్‌ రెడ్డి) సంతకం చేయగా, మిగిలిన దానిలో రవి విశ్వనాథన్‌ చేశారు.

ఇందులో మరో విశేషాంశమేంటంటే అన్ని వీలునామాలూ ఒకేరూపంలో రెండుభాగాలుగా ఉన్నాయి. ఒక భాగంలో ఇళ్లు, ఆవాసాలు, నగలు, నగదు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు భార్యాబిడ్డలకు ఇస్తున్నట్లు ఉంది. ఇది సాధారణం గా అందరి విషయాల్లో జరిగేదే! రెండో దాంట్లో మాత్రం విల్లు రాసినవారు ఓ రెండు కంపెనీల్లో ఉన్న తమ వాటాలను అదితి అనే అమ్మాయికి ధారాదత్తం చేస్తున్న ట్లు పేర్కొనడం అనేక ప్రశ్నలకు దారితీసింది. ఆ కంపెనీలు: అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అడ్వాంటేజ్‌), క్రియా ఎఫ్‌ఎంసీజీ. వీటి అంతిమ లబ్ధిదారు అదితి అనే అమ్మాయి అని స్పష్టంగా పేర్కొన్నా రు. ఆమె డాక్టర్‌ శ్రీనిధి అనే మహిళ కుమార్తె అని, డాక్టర్‌ బి.రంగరాజన్‌ అనే వ్యక్తికి మనవరాలనీ పేర్కొన్నారు. ‘‘డాక్టర్‌ రంగరాజన్‌ మాకు స్నేహితుడు, గురు వు, మార్గదర్శి. సమాజానికి ఆయన చేసిన మహోన్నత సేవకు కృతజ్ఞతగా ఈ షేర్లను ఆయన మనవరాలికిస్తు న్నాం’’ అని అందులో పేర్కొన్నారు. అడ్వాంటేజ్‌, క్రియా ఎఫ్‌ఎంసీజీల్లో ఆ నలుగురికీ సంయుక్తంగా ఉన్నవి 3,00,000 షేర్లు. కంపెనీలో 60ు వాటాకు సమానం. అంటే ఆ నలుగురి మరణానంతరం అదితికి అడ్వాంటేజ్‌లో 60ు యాజమాన్యం దక్కుతుందన్నమాట. మరి మిగిలిన 40ు ఎవరిది? అది మోహనన్‌ రాజేశ్‌ అనే వ్యక్తికి చెందిన ఆస్‌బ్రిడ్జ్‌ అనే కంపెనీ పేరిట ఉంది.

వాసన్‌ ఐ కేర్‌ లింకు!

అసలు ఈ అడ్వాంటేజ్‌ అనే కంపెనీ గురించి అందరి లో ఎందుకింత ఆసక్తి అంటే.. సుప్రసిద్ధ నేత్ర ఆస్పత్రి, కళ్లజోళ్ల విక్రయసంస్థ అయిన ‘వాసన్‌ ఐ కేర్‌’లో అడ్వాంటేజ్‌కు 60ు వాటా ఉంది. రూ.50 లక్షలే ఇచ్చి ఆ వాటా ను అడ్వాంటేజ్‌ కొనుగోలు చేసింది. మిగిలిన 40ుఈక్విటీని వాసన్‌సంస్థ రూ.45 కోట్లకు మారిష్‌సలోని సెకోనా క్యాపిటల్‌ అనే సంస్థకు విక్రయించింది. అంటే వాసన్‌లో అడ్వాంటేజ్‌ వాటా రూ 67.50 కోట్లు! అడ్వాంటేజ్‌కి సింగపూర్‌లో ‘అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(అడ్వాంటేజ్‌ సింగపూర్‌)’ అనే అనుబంధ సంస్థ కూడా ఉంది. అడ్వాంటేజ్‌ సంస్థకు అంటార్కిటికా ఖం డంలో మినహా అన్నిఖండాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు బయటపడింది. ఈ లింకులన్నింటినీ అతుకుతూపోతే తేలేదేంటంటే..

ఒకే రూపంలో ఉన్న నాలుగు వీలునామాల ద్వారా నలుగురు బినామీ లు వందల కోట్ల విలువైన తమ ఆస్తుల్ని బి.రంగరాజన్‌ అనే వ్యక్తి మీద ఉన్న గౌరవాభిమానాలతో ఆయన మనవరాలు అదితి పేరిట రాశారు. ఇంతకీ ఈ అదితి ఎవరో కాదు. కార్తి చిదంబరం, సునిధి చిదంబరం దంపతుల కుమార్తె. అంటే మన కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మనవరాలు. ఆమె పూర్తి పేరు అదితి నళినీ చిదంబరం. ఆమె బి.రంగరాజన్‌ మనవరాలన్న మాట కూడా నిజమే. ఎందుకంటే.. అదితి తల్లి సునిధికి తండ్రి ఆయనే. చిదంబరం రాజకీయ జీవితానికి ఇబ్బం ది లేకుండా చేసేందుకే అదితికి ఆస్తులు రాసే పత్రాల్లో రంగరాజన్‌ పేరు రాశారు.

ఆ నలుగురూ..
వీలునామా రాసిన నలుగురూ.. భాస్కరరామన్‌, సీబీఎన్‌ రెడ్డి, రవివిశ్వనాధన్‌, పద్మా విశ్వనాథన్‌- కార్తి చిదంబరానికి బినామీలు. అడ్వాంటేజ్‌లో 40ు వాటా ఉంద న్న మోహనన్‌ రాజేశ్‌ కూడా కార్తికి బినామీయే! ఈయ న కార్తి ఇంటి పక్కనే ఉండేవారు. 2006-11 మధ్య కాలంలో అడ్వాంటేజ్‌లో 5 లక్షల షేర్లను కార్తి ఈయన పేరిట బదలాయించి, ఆ తరువాత మళ్లీ తానే తీసుకున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.గురుమూర్తి (తమిళనాట పేరొందిన ‘తుగ్లక్‌’ పత్రిక ఎడిటర్‌, ఆర్థిక సలహాదారు) ఓ ప్రత్యేక కథనంలో బయటపెట్టారు. ఇక భాస్కర రామన్‌ పి.చిదంబరం కుటుంబానికి ఆర్థిక వ్యవహారాల మేనేజర్‌గా వ్యవహరించినట్లు ఈడీ తన దర్యాప్తు పత్రంలో వివరించింది. మొత్తానికి చిదంబరం ఏకైక వారసురాలు అదితి కోసమే తాత, తండ్రి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేశారు. షెల్‌ కంపెనీల ద్వారా పెట్టుబడులు, విదేశాల్లో అకౌంట్లు, విల్లాలు, టెన్నిస్‌ క్లబ్బులు.. ఒకటేంటి, మనీ లాండరింగ్‌ ద్వారా వందల కోట్లను తరలించారు. అవన్నీ ఈడీ దర్యాప్తులో బయటపడ్డాయి.

 

(Courtacy Andhrajyothi)

Leave a Reply