టిఫిన్లో వెంట్రుక వచ్చిందని.. భార్య తల గొరిగేశాడు!

0
312
బంగ్లాదేశ్‌లో ఘటన.. భర్త అరెస్టు
బంగ్లాదేశ్‌లో వెంట్రుక కార ణంగా ఓ భర్త జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నేరం నిరూపణ అయితే 14 ఏళ్లు కటకటాలు లెక్కించక తప్పదు! అంతేనా, ఈ వెంట్రుక అక్కడ ఓ ఉద్యమానికి కూడా కారణమైంది. బంగ్లాదేశ్‌లోని జోయ్‌పుర్హత్‌ జిల్లాకు చెందిన బబ్లు మొండల్‌ (35) టిఫిన్‌ చేస్తుంటే ఓ పేద్ద వెంట్రుక వచ్చింది. వెంటనే భార్యపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా బ్లేడు తీసుకుని ఆమె తలంతా గొరిగేశాడు. ఈ ఘటన వివాదం కావడంతో బబ్లూను అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగా తీవ్రంగా గాయపరిచాడనే అభియోగంతో అతనిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే గరిష్ఠంగా అతనికి 14 ఏళ్ల జైలుశిక్ష పడుతుందట. అంతేకాదు.. ఈ ఘటన నేపథ్యంలో మహిళలపై హింస పెరిగిపోతోందంటూ ఉద్యమకారులు భారీ ఉద్యమానికి తెరతీశారు.
courtesy Andhra jyothy..

Leave a Reply