మగాళ్లూ జాగ్రత్త

0
205

  • కట్నం కోసం వేధిస్తే ఖతమే!… బాధ భరించలేక భర్తలను చంపేస్తున్న భార్యలు
  • చంచల్‌గూడ జైలు ఖైదీల్లో 61% అంతే!
  • 217 మందిలో 133 మంది వారే
  • కేయూ స్కాలర్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌: ‘వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. కట్నం కోసం కోడలి ప్రాణాలు తీసిన అత్తింటివారు..’’ ఇలాంటి వార్తలు గతం! ఇప్పుడు ధోరణి మారింది. వరకట్నం కోసం అత్తింటి వేధింపులను, హత్యాయత్నాలను కోడళ్లు బేలగా భరించట్లేదు. ఆ వేధింపులను భరించలేక.. అత్తింటివారి హత్యాయత్నాల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి.. భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. కాకతీయ వర్సిటీ సోషియాలజీ విభాగ రిసెర్చ్‌ స్కాలర్‌ రమేశ్‌.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ మహిళా జైల్‌లోని ఖైదీలపై ఇటీవల అధ్యయనం చేశారు. అక్కడి మహిళా ఖైదీల్లో 61 శాతం వరకట్న సంబంధిత హత్య చేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఆయన అధ్యయనంలో వెల్లడైంది. అంకెల్లో చెప్పాలంటే.. జైల్లో మొత్తం 217 మంది ఖైదీలుండగా, అందులో 133 మంది వరకట్న వేధింపులు భరించలేక భర్తలను హత్యచేసినవారే!

  • ఖైదీల్లో 72.35 శాతం మంది నిరక్షరాస్యులు కాగా.. 25 శాతం మంది పదో తరగతి దాకా చదువుకున్నారు.
  • 217మంది ఖైదీల్లో అగ్రవర్ణాల వారు 8.29 శాతం కాగా.. బీసీలు 60.37 శాతం, ఎస్సీ, ఎస్టీలు 31.34 శాతం ఉన్నారు.
  • మహిళా ఖైదీలకు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదని సర్వేలో తేలింది. 131 మంది అసలు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదని వెల్లడయింది.
  • 118 మందికి శిక్షలు ఖరారయ్యాయి. 99 మంది అండర్‌ ట్రయిల్‌ ఖైదీలుగా ఉన్నారు.
  • ఖైదీల్లో హిందువులు 173 మంది, ముస్లింలు 31 మంది, క్రైస్తవులు 13 మంది.
  • 25-35 ఏళ్ల మధ్య వయస్కులు 87మంది, 36-45 ఏళ్ల మధ్య వయస్కులు 33 మంది ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

మహిళా ఖైదీల్లో 90 శాతం మంది ఆత్మరక్షణ కోసమే నేరాలు చేశారు.
పట్టణ, గ్రామీణ ప్రాంత మహిళలు సమానంగా నేరాలు చేస్తున్నారు.

Courtesy AndhraJyothy…

Leave a Reply