- హిజాబ్ నిరసనల కేసులోనే..
- నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ మానవ హక్కుల బృందం వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 30: దేశంలో ఒకే కేసుకు సంబంధించి ఏకంగా 100 మంది మరణశిక్ష ముప్పు పొంచి ఉంటే? ఇప్పటికే కొందరిని ఉరితీసిన నేపథ్యంలో ఏ రోజు ఎవర్ని ఉరితీస్తారో అన్న ఆందోళన బాధిత కుటుంబాల్లో నెలకొంటే? ఆ దేశం ఇరాన్ అయితే ఆ కేసు హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు సంబంఽధించింది!! హిజాబ్‌కు వ్యతిరేకంగా మూడు నెలలకుపైగా జరుగుతున్న ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పం తీసుకున్న అక్కడి ప్రభుత్వం, నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తోంది. అయితే ఈ నిరసనలకు సంబంధించి వంద మందిని పోలీసులు అరెస్టు చేశారని, వీరంతా మృత్యుదండన ముప్పును ఎదుర్కొంటున్నారని, బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చునని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ మానవ హక్కుల బృందం (ఐహెచ్‌ఆర్) పేర్కొంది.