తగ్గుతున్న హిందు-ముస్లిం సంతానోత్పత్తి రేటు అంతరం

0
30

అమెరికా సంస్థ అధ్యయనంలో వెల్లడి

: భారతదేశంలో హిందూ, ముస్లింల సంతానోత్పత్తి రేటు అంతరం క్రమంగా తగ్గిపోతోంది. 1992 నాటికి ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు సగటున 4.4గా ఉండేది. 2015 నాటికి అది 2.6కు తగ్గింది. హిందూ మహిళల సంతానోత్పత్తి రేటు 1992లో 3.3 నుంచి 2015లో 2.1కి తగ్గింది. అంటే.. సంతానోత్పత్తి రేటులో తేడా 1992లో 1.1గా ఉండగా.. 2015 నాటికి ఆ అంతరం 0.5కు తగ్గిపోయిందని అమెరికాకు చెందిన ప్యూరిసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైంది.

ఆ అధ్యయన నివేదికను ‘రెలీజియస్‌ కంపోజిషన్‌ ఆఫ్‌ ఇండియా’ పేరిట ప్యూరిసెర్చ్‌ విడుదల చేసింది. దాని ప్రకారం.. మొత్తం జనాభాలో 94ు దాకా హిందు, ముస్లింలే ఉండగా.. మిగతా ఆరు శాతంలో సిక్కులు, బౌద్ధులు, జైనులు ఉన్నారు.

Leave a Reply