కోవిడ్‌ పంజా: మూడో స్థానానికి భారత్‌

0
280

కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి భారతదేశం వణుకుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో జనం విలవిల్లాడుతున్నారు. కోవిడ్‌ కేసులు 7 లక్షలు దాటిపోవడంతో  రష్యాను అధిగమించి ప్రపంచంలో మూడో స్థానానికి భారత్‌ చేరింది.

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్‌ కేసులో మన దేశం ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది. కరోనా కేసుల్లో రష్యాను మనదేశం దాటేసి మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం నాటికి కరోనా కేసులు 7 లక్షలు దాటగా, మరణాలు 20 వేలు దాటాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 7,12,92 కోవిడ్‌ కేసులు నమోదు కాగా, 20,073 మంది కరోనా కాటుకు బలైయ్యారు. కరోనా బారి నుంచి 4,35,441 మంది కోలుకున్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి కోవిడ్‌-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అన్‌లాక్1.0 నుంచే దేశంలో రోజూ వేలాది కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం 6,555 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 6 వేల 619కి చేరింది. తమిళనాడులో 4,150, ఢిల్లీలో 2,244, కర్ణాటకలో 1,925 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్నటిదాకా వెయ్యిలోపే కేసులు నమోదైన ఉత్తర్ప్రదేశ్లోనూ ఇప్పుడు వెయ్యికి మించి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. నార్త్ఈస్టర్న్ స్టేట్ అయిన అస్సాంలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఇక, ఆదివారం 15,820 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4 లక్షల 24 వేల 885కి చేరింది. ఇక, దేశంలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ సగటు రికవరీ రేటు 60.9గా ఉంది. 85.9 శాతం రికవరీలతో ఛత్తీస్‌గఢ్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోటీ 16 లక్షల 30 వేల 451 మంది కరోనా బారిన పడ్డారు. 5 లక్షల 38 వేల 161 మంది మృత్యువాత పడ్డారు. 65 లక్షల 79 వేల 999 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

Leave a Reply