భారత్ లౌకికదేశం

0
258

 ఢిల్లీ హింస ఆందోళనకరం : అమర్త్యసేన్‌
మతపరంగా విభజించలేం..

కోల్‌కతా : భారత్‌ లౌకిక దేశమనీ, ఇక్కడి ప్రజలను మతపరంగా విభజించలేమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ అన్నారు. కోల్‌కతాలోని బోల్‌పూర్‌లో జరిగిన ఓకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లా డుతూ.. ‘భారత్‌ లౌకికదేశం. ఇక్కడి ప్రజలను హిందూవులు, ముస్లింలుగా మనం విభజిం చలేం. ఒకవేళ ముస్లిం లు వేధింపులకు గురవు తున్నా వారికి రక్షణ కల్పించ డంలో పోలీసులు విఫలమవుతున్నారంటే అది ఆందోళన చెందాల్సిన అంశం.’ అని తెలిపారు. ఢిల్లీ అల్లర్లపై స్పందిస్తూ.. దేశరాజధానిలో చోటుచేసుకున్న హింస తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఈశాన్య ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీలు జరిగినా వారిపై అల్లరి మూకలు దాడులు చేస్తే పోలీసులు నిస్సహాయక స్థితిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. అంతేగాక ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా, యూపీలోని అలీగఢ్‌ ముస్లిం వర్సిటీలలో విద్యార్థులపై భద్రతా బలగాలు వ్యవహరించిన తీరుపైనా సేన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఢిల్లీలో పలువురు దుండగులు చేతిలో తుపాకులు పట్టుకుని సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నా రక్షకభటులు ఏం చేస్తున్నారని సేన్‌ ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్లకు కారణ మైన పలువురు బీజేపీ నాయకుల విద్వేష ప్రసంగాలపై ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీచేయడంపై స్పందిస్తూ… ‘వ్యక్తిగతం గా ఆయన నాకు తెలుసు. ఆయన బదిలీపై ప్రశ్నలు తలెత్తడం సాధారణ మే. కానీ నేను ఎలాంటి తీర్పునూ వెలువరించలేను’ అని తెలిపారు.

Courtesy Nava Telangana

Leave a Reply