ఏవండోయ్.. మీ సంపద రెట్టింపైంది.

0
246

2019లో వ్యక్తుల సంపద 12.8 లక్షల కోట్ల డాలర్లకు
ముంబయి: ఇటీవల ఆర్థిక వృద్ధి అయిదేళ్ల కనిష్టానికి చేరి ఉండొచ్చు కానీ.. వ్యక్తుల సంపద మాత్రం 2019 ఏడాదిలో రెట్టింపు కావడం విశేషం. స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిజీ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మొత్తం వ్యక్తుల సంపద 2018లో 5.972 లక్షల కోట్ల డాలర్లు(రూ.418 లక్షల | కోట్లు)గా ఉండగా.. అది 2019లో 12.6 లక్షల కోట్ల డాలర్ల(రూ.882 లక్షల కోట్లు)కు చేరుకున్నట్లు

వివరించింది. అయితే ఇలా పెరగడానికి గల కారణాన్ని ఈ బ్యాంకు వెల్లడించలేదు. దాదాపు అన్ని కీలక 7 ఆర్థిక అంశాలు డీలా పడుతున్న వేళ ఈ నివేదిక రావడం విశేషం. కరెన్సీ హెచ్చుతగ్గులనూ లెక్కలోకి ” తీసుకుని రూపొందించిన ఆ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు…

  • 2000 సంవత్సరం నుంచి 2019 మధ్య దేశంలో వ్యక్తుల సంపద నాలుగింతలు పెరిగింది.
  • వచ్చే అయిదేళ్లలో మరో 48 శాతం లేదా 4.4 లక్షల కోట్ల డాలర్ల మేర సంపద వృద్ధి చెందవచ్చు.
  • పెరిగిన సంపదలో స్థిరాస్తి అయిన బంగారం, భూములు, ఇళ్లతో పాటు పలు పెట్టుబడులు ఉన్నాయి. అయితే 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి మార్కెట్ కాస్త డీలా పడింది.
  • ఒక్కో వ్యక్తి సంపద 3.3 శాతమే పెరిగి 14,589 డాలర్లు(రూ.10 లక్షల పైన)గా నమోదైంది. మొత్తం వ్యక్తుల అప్పులు మాత్రం 11.5 శాతం హెచ్చి 120 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
  • ఆర్థిక ఆస్తులు 1.4% పెరగ్గా.. ఆర్థికేతర ఆస్తులు 6.9 శాతం మేర వృద్ధి చెందడం చూస్తుంటే.. మార్కెట్లలో ఊగిసలాటకు అద్దం పడుతున్నాయి.
  • 8.27 లక్షల మంది చేతుల్లో అంతర్జాతీయ సంపదలో 1.8 శాతం ఉండడం గమనార్హం.
  • 4500 మందికి 50 మి. డాలర్ల(రూ.350 కోట్లు) వరకు; 1790 మందికి 100 మి. డాలర్ల(రూ.700 కోట్లు) వరకు సంపద ఉంది.
  • అధిక నికర సంపద గల వ్యక్తుల సంఖ్య విషయంలో భారత్ అయిదో స్థానంలో ఉంది.

Courtesy Eenadu 

Leave a Reply