భారత్ : 28 రాష్ట్రాలు… 9 కేంద్ర పాలిత ప్రాంతాలు…

0
3042

– పొలిటికల్‌ మ్యాప్‌ విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశ కొత్త రాజకీయ మ్యాప్‌ను కేంద్ర హోం శాఖ శనివారం విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌గా గురువారం అధికారికంగా గురువారం విభజించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశం.. 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందింది. పుదుచ్చేరిలాగా జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం శాసనసభ వ్యవస్థను కలిగివుండగా, చండీగఢ్‌లాగా లడఖ్‌ శాసనసభ లేకుండా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు నేతృత్వం వహిస్తారు. జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు కొత్తగా ఏర్పడిన రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఎల్జీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రాల జాబితా
1. ఆంధ్రప్రదేశ్‌, 2. అరుణాచల్‌ ప్రదేశ్‌, 3. అసోం, 4. బీహార్‌, 5. ఛత్తీస్‌గఢ్‌, 6. గోవా, 7. గుజరాత్‌, 8. హర్యానా, 9. హిమాచల్‌ ప్రదేశ్‌, 10. జార్ఖండ్‌, 11. కర్ణాటక, 12. కేరళ , 13. మధ్యప్రదేశ్‌, 14. మహారాష్ట్ర, 15. మణిపూర్‌, 16. మేఘాలయ, 17. మిజోరం, 18. నాగాలాండ్‌, 19. ఒడిషా, 20. పంజాబ్‌, 21. రాజస్థాన్‌, 22. సిక్కిం, 23. తమిళనాడు, 24. తెలంగాణ, 25. త్రిపుర, 26. ఉత్తర ప్రదేశ్‌, 27. ఉత్తరాఖండ్‌, 28. పశ్చిమ బెంగాల్‌
కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా
1. అండమాన్‌ అండ్‌ నికోబార్‌, 2. చండీగఢ్‌, 3. డయ్యూ అండ్‌ డామన్‌, 4. దాదర్‌ అండ్‌ నగర్‌ హవేలి, 5. ఢిల్లీ, 6. జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, 7. లడఖ్‌, 8. లక్షద్వీప్‌, 9. పుదుచ్చేరి.

Courtesy Navatelangana…

Leave a Reply