కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతుల ఆత్మహత్య

0
82

హైదరాబాద్/రామంతాపూర్‌: కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఉప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. పాత రామంతాపూర్‌కు చెందిన కొత్త రాజయ్య కుమారుడు సాయిగౌడ్‌(26), మౌలాలి మీర్‌పేట్‌కు చెందిన సుండూరు గురువప్ప కుమార్తె నవనీత (26)   ఈ ఏడాది ఫిబ్రవరి 10 ఉప్పల్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. రామంతాపూర్‌ శ్రీనగర్‌ కాలనీలో కాపురం పెట్టారు. గతంలో ఫెస్ట్‌ కంట్రోల్‌ స్ర్పే బాయ్‌గా పని చేసిన సాయిగౌడ్‌ నెల రోజులుగా పని లేక మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ ఉరేసుకున్నారు. నవనీత మెడపై గాయంతో మృతదేహం బెడ్‌పై పడి ఉండగా, సాయిగౌడ్‌ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శుక్రవారం రాత్రి నుంచి నవనీత ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానంతో ఆమె సోదరుడు శ్రీనగర్‌ కాలనీకి వచ్చి ఇంటి తలుపులను పగులగొట్టి చూడగా, ఇరువురి మృతదేహాలు కనిపించాయి. ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply