హరియాణాలో ఘటన.. నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్ష
హిస్సార్ : జిలేబీ బాబా! ఇలా స్వీటు పేరుతో ఆ దొంగ బాబా… మహిళలు, బాలికలను ఆకర్షించాడు! తాను చేతబడులు తొలగిస్తానని, దుష్టశక్తుల పని పడతానని నమ్మబలికి ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు!! హరియాణాలోని హిస్సార్‌లో దాదాపు నాలుగేళ్ల క్రితం వెలుగుచూసిన ఈ దారుణానికి సంబంధించి ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జిలేబీ బాబా పేరుతో దారుణాలకు ఒడిగట్టిన బిల్లూ రామ్ అలియాస్ అమర్‌పూరికి పోక్సో చట్టం కింద కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పంజాబ్‌లోని మన్సా జిల్లాకు చెందిన బిల్లూ రామ్, 20 ఏళ్ల క్రితం జిలేబీలు అమ్ముకొని ఉపాధి పొందేందుకు హరియాణాలోని తోహ్నా వచ్చాడు. కొన్నాళ్లకు తాను క్షుద్ర పూజల ఆట కట్టిస్తానంటూ ప్రచారం చేసుకొని ఆశ్రమం తెరిచాడు. నమ్మి వచ్చిన మహిళలకు జిలేబీ బాబా మర్యాద పేరుతో మత్తుమందును కలిపిన చాయ్‌ని ఇచ్చి అత్యాచారం చేసేవాడు.