సీఏఏను వ్యతిరేకించిన జర్నలిస్టు

0
42

– ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనకుండా దూరం పెట్టిన గోవా సర్కారు
పనాజీ: కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల్లోన్ని బీజేపీ ప్రభుత్వాలు పౌరుల మాట్లాడే స్వేచ్ఛను హరించడమే కాకుండా.. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కుట్రపూరితంగా వ్యవహరి స్తున్నాయి. వివాదాస్పద సీఏఏను వ్యతిరేకించినందుకు గానూ గోవాలోని బీజేపీ సర్కారు.. ఓ జర్నలిస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రంలో పాల్గొనకుండా దూరం పెట్టింది. నేటి నుంచి 30వరకు రాష్ట్ర రాజధాని పనాజీలో గోవా సాంస్కృతిక శాఖ ఓ వేడుకను నిర్వహిస్తున్నది. ముందుగా ఎంపిక చేసిన జాబితా ప్రకారం.. ప్రముఖ టీవీ జర్నలిస్టు ఫయే డిసౌజా ఈ కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించాల్సి ఉన్నది. అయితే ఉన్నట్టుండి ఆ జాబితా నుంచి డిసౌజా పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ” ప్రసంగించాల్సిన వారి తుది జాబితాలో ఆమె పేరు ఉన్నది. కానీ, ఆమె వైఖరి సీఏఏకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి డిసౌజాను దూరం పెట్టాం” అని గోవా మంత్రి గోవింద్‌ గవాడే తెలిపారు. ప్రధాని మోడీ, రాష్ట్ర సీఎం ప్రమోద్‌ సావంత్‌ల నుంచి అందిన ఆదేశాల మేరకే ఆమెను దూరం పెట్టారన్న ఆరోపణలు ఆయన తోసిపుచ్చారు. అయితే గోవా సర్కారు చర్యను జర్నలిస్టులు, సామాజికవేత్తలు తప్పుబట్టారు.

Courtesy Nava telangana

Leave a Reply