రాజ్యాంగంలో షెడ్యూలు ఐదు జ్యూడిషియల్ రివ్యూకి అతీతం!

0
244

– ఏజెన్సీలోని ట్రైబల్స్‌కి 100 శాతం రిజర్వేషన్లు దాని ప్రకారమే
– రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులకి రిజర్వేషన్లపై సుప్రీంలో పిల్‌

న్యూఢిల్లీ బ్యూరో :
భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ పేరా 5(1) పరిధిలో జారీ చేసిన ఏదయినా పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జ్యూడిషియల్‌ రివ్యూ(న్యాయ సమీక్ష)కు అతీతమైనదని పేర్కొంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు)లో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం గిరిజన రిజర్వేషన్లకు ఉద్దేశించిన జీవో చెల్లుబాటవుతుందని ఆ పిటిషిన్‌ పేర్కొంది. దీన్ని దేశంలో ఏ కింది స్థాయి కోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా దీనిని రద్దు చేయజాలదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలును అనుసరించి 10.01.2000 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో న్యాయ సమీక్షకు లోబడదని వ్యాఖ్యానించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ ఎంఎన్‌ రావు పర్యవేక్షించగా న్యాయవాది ఎ.హన్మంతరెడ్డి రూపొందించిన ఈ పిటిషన్‌ను ఆధార్‌ సొసైటీ తరపున న్యాయవాది అల్లంకి రమేష్‌ భారత సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కేటాయించడం చెల్లదని ఏప్రిల్‌ లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రమేష్‌ అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టుకు దీనిపై న్యాయ సమీక్ష జరిపే అధికారం లేదని పిటిషన్లో ఆయన స్పష్టం చేశారు. ‘ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు పాఠశాలలకు వెళ్లే పిల్లల శాతం పెడ్యూల్‌ ప్రాంతాలలో చాలా తక్కువగా ఉంటుంది. సామాజిక నిర్మాణం, వారి భాష, ప్రాంతాల సామీప్యత. గిరిజనేతర ఉపాధ్యాయుల నుంచి పిల్లలు నేర్చుకోవటానికి ఇష్టపడకపోవడం చేత, గిరిజనేతర ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతాల్లో నివసించడానికి ఆసక్తి చూపకపోవడం ఆయా ప్రాంతాల్లో విద్య ఉన్నతిని దెబ్బతీసింది.

ఈ పరిస్థితిని గ్రహించి, విద్యారంగంలో అసమతుల్యతను సరిచేయడానికి గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని షెడ్యూల్‌ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులన్నింటినీ స్థానిక షెడ్యూల్డ్‌ తెగ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. గిరిజ నేతర ఆశావాహులు ఈ నోటిఫికేషన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 116 ను ఉల్లంఘించిందని ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ముందు సవాలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది.

దీంతో కొందరు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీప్‌ పిటిషన్లను దాఖలు చేయగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టి జీవోను రద్దు చేసింది. అయితే షెడ్యూలు ఐదులోని 5(1) పేరా కింద ఈ నోటిఫికేషన్‌ ఇచ్చినందున ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు. అందువల్ల సుప్రీం కోరు ఆటో అమలును పునరుద్ధరించాలి. 5(1) పేరా కింద చేసిన ఏదైనా చట్టాన్ని గిరిజనేతరులు సవాలు చేయడానికి గల అర్హతను సుప్రీం కోర్టు తేల్చాలి..’ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉంది.

Courtesy Nava telangana

Leave a Reply