ఇదీ రిజర్వేషన్ల చరిత్ర..

0
507

రిజర్వేషన్స్ డే -జులై 26

“గవర్నమెంటు ఉద్యోగులకు జనాభాలోని అన్ని కులాల నుంచి ఆయా కులాల సంఖ్యకు తగినట్టుగా అభ్యర్థులను ఎంచుకొని నియమించాలి”.
– #పూలే. (19-10-1882 @ హంటర్ కమిషన్ కు చేసిన ప్రతిపాదన)

50% వెనకబడిన తరగతుల నుండి ఖాళీలు భర్తీ చేయాలని ఆదేసిస్తున్నాను. వెనుకబడిన తరగతుల నిష్పత్తి 50 శాతం కన్నా తక్కువగా ఉన్న అన్ని కార్యాలయాలలో తదుపరి నియామకం వెనుకబడిన తరగతి సభ్యుడికి ఇవ్వబడుతుంది.
– #చత్రపతి_సాహుమహరాజ్ @26 జులై 1902

“సార్వత్రిక (అందరికి) విద్య” అందరికీ అవసరం లేదు.
– బాలగంగాధర్ తిలక్, కేసరి పత్రిక

1894లో చత్రపతి సాహూ మహరాజ్ మహారాష్ట్రలోని కోల్హాపూర్ సంస్థాన పాలనాధికారాలను స్వీకరించాడు. చత్రపతి శివాజీ వారసుడుగా గద్దెనెక్కిన సాహూ మహారాజ్ నిజానికి బ్రాహ్మణ సంస్కృతిని ఆచరించి ఉండవలసింది. కానీ అందుకు భిన్నంగా అతను మహాత్మా పూలే నిర్వహించిన సత్యశోధక ఉద్యమ వారసత్వాన్ని ఎన్నుకున్నాడు. తన సంస్థానంలో విద్య, వైద్యం, పోలీసు, న్యాయ, రెవెన్యూ వంటి శాఖల ప్రత్యేక విభాగాలకు పరివేక్షణ అధికారులంతా బ్రాహ్మణలచే నిండి ఉండటం గమనించాడు. డాక్టర్లు, బారిస్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు లాంటి ఉన్నత స్థానాలన్ని బ్రాహ్మణనులే ఆక్రమించడం చూశాడు. మరాఠాలను ఇతర బ్రాహ్మణనేతరులను ఉన్నత ఉద్యోగాల్లోకి తీసుకోస్తే తప్ప వాళ్ళ సామాజిక హోదాలో మార్పు రాదని భావించాడు. కానీ పదవులకు అవసరమైన విద్యా అర్హతలు బ్రాహ్మనేతరులకు బొత్తిగా లేవు. ముందుగా వాళ్ళకు ఆధునిక విద్యా విధానంలో ప్రవేశం కల్పిస్తే తప్ప ఉద్యోగాలు యివ్వడం వీలుపడదు. వెంటనే వెనుకబడిన కులాల పిల్లల కోసం స్కూళ్ళు, హాస్టళ్ళను ప్రారంభించాడు. దీంతో బ్రాహ్మణలు గగ్గోలు పెట్టారు.

రాజభవనంలో అన్ని కార్యక్రమాలను పౌరాణిక విధానం (శూద్రులకు చేసేవి)లో నిర్వహించడాన్ని సాహు అడ్డుకుని వేదోక్తకంగా నిర్వహించాలని ఆదేశించాడు. శూద్రులకు వేదోక్తంగా విధులు నిర్వహించడం శాస్త్ర విరుద్ధమని తెగేసి చెప్పారు పురోహితులు. వారి ఉద్యోగాలను పీకేసినా వారి భూములను లాక్కున్నా బ్రహ్మణులు సాహూ మహారాజ్ గారిని ఖాతరు చేయలేదు. పైగా సాహూ మహారాజ్ పై బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ కూడా సాహూ మహారాజ్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. బ్రిటీష్ ప్రభుత్వం బ్రాహ్మణ పురోహితులకు – సాహూ మహారాజ్ గారికి మధ్య సంధి కుదిర్చి ఇకపై సాహూ మహరాజ్ గారికి వైదిక కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా బ్రాహ్మణుల భూములను తిరిగి ఇచ్చివేయాలని తీర్పు చెప్పింది.

భారతదేశ చరిత్రలో అసమానతను సమాధి చేస్తూ సమానతకి_పునాది వేసి ఛత్రపతి సాహు మహారాజ్ తొలిసారిగా 1902 జులై 26 న వెనుకబడిన వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు) వారికి తన కొల్హాపూర్ సంస్థానంలో విద్య ఉద్యోగ రంగాల్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసాడు. ఆ రోజునే మనం ‘రిజర్వేషన్స్ డే’గా జరుపుకుంటున్నాం.

ఛత్రపతి సాహు మహారాజ్ 1917 నాటికి అప్పటి మాజీ బొంబాయి గవర్నర్‌ లార్డ్ సిడెన్ హామ్ కి లేఖ రాస్తూ అప్పటి అగ్రవర్ణ బ్రాహ్మణుల కుట్రలు కుతంత్రాలు అరాచకాలు మోసాలు నీతి బాహ్యమైన విధానాలని వివరిస్తూ వారి చేతిలో అణచి వేయబడుతున్న భారతదేశ ప్రజలకు అప్పటికి రాబోయే “మాంటేగ్ – చెమ్స్ఫర్డ్ సoస్కరణలు” ద్వారా ఏర్పడబోయే భారత ప్రభుత్వ చట్టం- 1919 ద్వారా దేశంలోని సాధారణ ప్రజల ప్రయోజనార్థం ప్రజల రక్షణ కొరకు ప్రభుత్వ చట్ట సభల్లోను (కౌన్సిల్స్) అన్ని చిన్న పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోను (ప్రభుత్వ యంత్రాంగం) క్రింది కులాల వారందరికి రిజర్వేషన్స్ కల్పించాలని రాసాడు. ఆ లేఖలో కనీసం ఇరవై ఏండ్లయిన ఈ రిజర్వేషన్ లు ఉండాలని కోరాడు. దేశమంతా కింది కులాల వారికి రిజర్వేషన్స్ ఎందుకు అవసరమో అనే దానిని వివరిస్తూ దానికి ఉదాహరణగా తన కొల్హాపూర్ రాజ్యంలో ఏ పరిస్థితుల మధ్య తను రిజర్వేషన్స్ కల్పించాల్సి వచ్చిందో వివరించాడు. “ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత” ఉండాలనీ చెప్తూ కుల ప్రాతిపధికన జనాభాని బట్టి రిజర్వేషన్స్ కల్పించాలనీ విన్నవించాడు. “సార్వత్రిక (అందరికి) విద్య” అవసరం లేదని శూద్ర కులాల విద్యా విధానాన్ని తన “కేసరి” పత్రికలో బహిరంగంగా వ్యతిరేకించిన బాలగంగాధర్ తిలక్ కుట్రలను తేటతెల్లం చేశాడు.

1918 లో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలోని చట్టసభలలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే అంశం పరిశీలించుటకై నియమించిన “సౌత్ బరో కమీషన్”కి కాంగ్రేస్ పార్టీ తరపున బ్రాహ్మణులు ప్రాతినిథ్యం వహించగా ముస్లిముల తరపున మహమ్మద్ అలీ జిన్నా ఆ కమీషన్ కి రిప్రజేంటేషన్ ఇచ్చాడు. అదే విధంగా దళితుల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ తో కలిసి బీసీ (శూద్రుల) తరపున ఫూలే అనంతరం సాహు మహారాజు తానే స్వయంగా నడిపిస్తున్న “సత్య శోధక్ సమాజ్“ తరపున కార్యదర్శి భాస్కర్ రావ్ జాదవ్ ని పంపించాడు.

ప్రపంచం గర్వించదగ్గ భారతదేశ బహుజన రాజు అయిన ఛత్రపతి సాహు మహారాజ్ రిజర్వేషన్స్ కల్పించిన 118 ఏండ్లు నిండిన సందర్భంగా నైనా రిజర్వేషన్ భావన స్పూర్తికి విరుద్ధంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకించాలి. బీసీలు విద్యా, ఉద్యోగ, చట్ట సభల్లో తమ వాటా ప్రకారం జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్స్ పెంపుదల కోసం పోరాటం ఉధృతం చేయాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సీట్లను తమ జనాభా 58% ప్రకారం అన్ని సీట్లకు రిజర్వేషన్ కోరుతూనే “ఎవరి జనాభా ఎoతో వారి వాటా అంత” అన్న సాహు మహారాజ్ స్పూర్తితో బీసీలలో ఏ బీ సీ డీ వర్గీకరణ ప్రకారం అన్ని కులాలకి సీట్లు వచ్చే న్యాయమైన డిమాండ్ కి మద్దతు ఇచ్చి కొట్లాడి సాధించుకోవాలి.

రిజర్వేషన్లలో రకాలు:
1) Reservation in Education: దేశంలో రాజ్యాంగము వున్నంత వరకు రిజర్వేషన్లు వుంటాయి. కులవ్యవస్త వున్నంత వరకు రిజర్వేషన్లు వుంటాయి. బ్రాహ్మణ వ్యవస్త వున్నంత వరకు కులవ్యవస్త వుంటుంది..
2) Reservation in Services: దీనికి కాల పరిమితి లేదు. మొదటిదాని మాదిరిగానే unlimited
3) Reservation in politics: రాజ్యాంగము ప్రకారం వీటికి 10 సంవత్సరాలు…కాలపరిమితి.

(గమనిక: 10 సంవత్సరాల కాల పరిమితి కేవలం పొలిటికల్ రిజర్వేషన్లకు మాత్రమే. విద్య ఉద్యోగాల్లో కాల పరిమితి లేదు.)
కాని పాలకవర్గం 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరూ అడగకుండానే పొలిటికల్ రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతోంది. బాబాసాహేబ్ ద్వారా 10 సంవత్సరాల తర్వాత పొలిటికల్ రిజర్వేషన్లు తీసేయాలని రాజ్యాంగములో స్పష్టంగా వ్రాయబడింది. అయినా వారు పొలిటికల్ రిజర్వేషన్లు తీసేయడం లేదు. ఇలా చేసి ఆయా పార్టీల చెంచాలను పదవుల్లో ఉంచుకొని తీవ్ర నష్టం కలిగిస్తోంది.

పూనా ఒప్పందము ద్వారా వచ్చిన పొలిటికల్ రిజర్వేషన్లు (గాంధి -అంబేడ్కర్) అనేవి ఒక కుట్ర పూరిత ఒప్పందం.
“ఈ పూనా ఒప్పందము నాపై గాంధీ మరియు మనువాద పాలక కాంగ్రెస్ కుట్రలతో అమలు జరిగింది. ఈ పూనా ఒప్పందము నాకే మాత్రం ఇష్టం లేదు. దీని ద్వారా SCSTBC లలో దళారులు చెంచాలు మరయు మోసగాళ్ళు ఎన్నికై వస్తారు. వీరు సమాజ బాగు కొరకు ఎన్నిక కాబడరు. వీరు మను దుర్మార్గ పాలకవర్గాలకు చెంచాగిరి చేస్తారు. వీరు సమాజం యొక్క REAL REPRESENTATIVES కాదు.
– Dr. B.R. Ambedkar.

కాబట్టి 10 సంవత్సరాల కొకసారి ఈ దళారులకు మోసగాళ్ళకు చెంచాలకు వీరు అడగకుండానే పార్లమెంట్ లో without dicussion & debate బిల్ పాస్ చేస్తారు. ప్రజలకు మాత్రం మేము మళ్లీ రిజర్వేషన్లను10 సంవత్సరాలు పెంచామని ప్రజలను misguide చేస్తారు…
‌‌ఇప్పుడు రిజర్వేషన్లను అమలు పరచకుండా ఎన్నో రకాల కుట్రపూరిత వ్యూహలు అమలు చేస్తున్నారు..

(1). రిజర్వేషన్ల పై కన్ఫ్యూజన్ చేయడం.
(2). ప్రైవైటీకరణ (LPG SEZ) అమలు పరచడము.
(3). రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఆక్ట్ (రిజర్వేషన్లు అమలు చేసే చట్టం) తేకపోవడం.
(4).పరిశ్రమలను జాతీయం చెయ్యక పోవడం.
(5).భూ చట్టాలలో మార్పు తేవకపోవడం.
(6) ప్రజల్లోకి అభివృద్ధి పథకాలను తీసుకు వెళ్ళకపోవడం.
(7) ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం.

రిజర్వేషన్ల పద్దతికి గీటురాయి ఏంటి అనే విషయం
ప్రజలకు తెలియదు..
రిజర్వేషన్లకు ఆదారం ECONOMIC_CRITERIA అని ప్రజల్లో అబద్దపుప్రచారం చేయిస్తారు పాలకవర్గాలు. కాని రిజర్వేషన్లకుఆధారందేశంలో_కులమే.
రాజ్యాంగ సభ జరుగుతున్నపుడు ఈ అంశంపై ఏకంగా 16 గంటలు చర్చ జరిగింది. ఇందులో రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఎకానమికల్ స్టేటస్ కాదు
కేవలం కులం కులం కులమే..నని రాజ్యాంగ సభలో తన వాదనలు వినిపించి అందరి అంగీకారంతో శాసనం చేశాడు అంబేద్కర్.
మను ధర్మం మనుషులను కులాలుగా విడగొట్టి కనీస మానవ హక్కులకు దూరం చేసి వెలివేసింది. కాబట్టి కులాల ప్రాతిపదిక గానే రిజర్వేషన్లు రాజ్యాంగలో పొందుపర్చింది.
ఎందుకంటే:
కులం: IMMOVABLE
ఆర్థికం:. MOVABLE
మనుషుల దగ్గర డబ్బు ఈరోజు వుండవచ్చు రేపు వుండకపోవచ్చు. మనుషులు ఇప్పుడు ధనవంతులు రేపు బిచ్చగాళ్లు కావచ్చు. కాని మను ధర్మంలో కులం శాశ్వతం. మతం మారినా కులం వెంటాడుతోంది. బ్రాహ్మణ ధర్మం ధర్మం కాదు అది అధర్మం. అది రేసియల్ డిస్ర్కిమినేషన్. ఈ RACIAL DESCREMINATION అనుభవిస్తున్న కులాలన్నింటికి వాటి వాటి తీవ్రతను బట్టి విద్యా , ఉద్యోగ, ఉపాది, అధికారంలలో వారి వారి కులాల జనాభా దామాషా ప్రకారం వారి ప్రాతినిధ్యము కొరకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని రాజ్యాంగములో పొందుపరిచాడు అంబేడ్కర్.
రాజ్యాంగము యొక్క ఆదేశము Adequate Representation ఎవరి కుల జనాబా ఎంతవుంటే విద్యా, ఉద్యోగ, ఉపాది మరియు అధికారంలలో అంత భాగస్వామ్యం వుండాల్సిందే…
ఇదీ రిజర్వేషన్ల చరిత్ర..

ఈ చరిత్రంతా మనకు తెలిసింది ఒక్క కాన్షిరాం వల్లే…

Leave a Reply