ఆర్టికల్ 370 రద్దుతో మహిళల్లో భయాందోళన

0
200
ఆర్టికల్ 370 రద్దుతో మహిళల్లో భయాందోళన

Image result for Kashmiri women under fear"– జమ్మూ కాశ్మీర్‌ ప్రతినిధులు సోనియా జంవాల్‌, మోబినా అక్తర్‌

ఆర్టికల్‌ 370 రద్దు మా జీవితా ల్లో చీకటిని నింపింది. మహిళల్లో భయాందోళనలను స ృష్టించింది. దీనివల్ల మా హక్కులు లూటీ అయ్యాయి. ఇప్పటికే సమాజంలో మహిళకు రెండో స్థానం ఇవ్వబడిం ది. ఇలాంటి వివక్ష నిర్ణయాలతో మహిళలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. మహిళలపై దాడి దేశవ్యాప్తంగా ఉంది. కానీ కాశ్మీర్‌లో పరిస్థితి అంతకంటే దారుణంగా ఉన్నది. అర్థరాత్రి మహిళ తిరగడమేమోగానీ, పట్టపగలే తిరగలేని పరిస్థితి కాశ్మీర్‌లోనూ, బయట ఉన్నది. కాశ్మీర్‌ ప్రజలకు మరి ముఖ్యంగా మహిళలకు రక్షణగా నిలవాల్సిన వారినుంచే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది. ఒక ఉగ్రవాదుల నుంచి, మరోపక్క ప్రభుత్వం నుంచి ఇలా రెండు రకాల దాడులకు గురవుతున్నామని 12వ అఖిల భారత మహాసభలకు హాజరైన జమ్మూకాశ్మీర్‌ ప్రతినిధులు సోనియా జంవాల్‌, మోబినా అక్తర్‌లు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్టికల్‌

370 రద్దుతో ఉత్పన్నమవుతున్న సమస్యలేంటీ?
ఆర్టికల్‌ 370 రద్దుతో రాజ్యాంగాన్ని హత్య చేశారు. అంతేకాకుండా మా సంస్కృతి పై దాడి జరిగింది. గతంలో ప్రత్యేక హక్కులుండేవి. వాటిని ఇప్పుడు లాగేసుకున్నారు. కాశ్మీర్‌లోని మహిళ సమాజం తీవ్ర నిరాశకు గురైంది. కుటుంబాన్ని నడిపే మహిళకు అనేక ఇబ్బందులు తలెత్తాయి. పిల్లలకు సరిగా భోజనం పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. కుటుంబం నడిపేందుకు అవసరమైన కనీస అవసరాలకు కూడా నోచుకోవడం లేదు. కొన్ని రోజులు పస్తులున్నాం. ఒక్కొక్క రోజు ఒక పూట తినే పరిస్థితి ఉంది. చిన్నారులకు పాలు వంటివి కూడా దొరికేవి కాదు. అయితే తమూ ఇలాంటి అనుభవాలు ఎన్నో చూశాం. ఆ అనుభవంతోనే కొంత మేరకు ఆహార పదార్థాలు దాచుకుంటాం. అవే మమ్మల్ని కాపాడాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కనీసం ఆహారం కూడా అందించేందుకు ప్రభుత్వ వర్గాలు యోచించలేదు. మరోవైపు తమ ఇంట్లో మగవారిని అరెస్టులు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియటం లేదు. దానికి ఒక ఆధారం కూడా దొరకదు. చిన్నారులను కూడా అరెస్టు చేశారు. దీంతో కుటుంబాన్ని మహిళలు మాత్రమే నడపాల్సి వచ్చింది.

మహిళల ఉపాధి పరిస్థితి ఏంటీ?
మోడీ సర్కార్‌ హయంలో దేశంలోనే ఉపాధి పడిపోయింది. అందులో భాగంగానే కాశ్మీరీల ఉపాధి పడిపోయింది. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కాశ్మీర్‌లో ఉపాధికి గండిపడింది. దీంతోపాటు మహిళలకు కూడా ఉపాధి లేకుండా పోయింది. కాశ్మీర్‌లో ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉద్యోగాలు మాత్రమే మహిళలు చేస్తారు. ఆ సంస్క ృతి మాత్రమే అక్కడ ఉంది. రోజువారీ కూలీ పనికి అక్కడ మహిళలు వెళ్లరూ. ఒకవేళ వెళ్లినా కూడా అనుమతించరు.

ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా?
ఆర్టికల్‌ 370 రద్దు తరువాత నెలకొన్న పరిస్థితుల్లో మార్పు ఏమీ రాలేదు. కానీ ప్రభుత్వం ప్రచారం అందుకు భిన్నంగా ఉంది. అక్కడేదో సాధారణ పరిస్థితులు నెలకొన్నాట్లు ప్రచారం చేస్తుంది. కానీ భయాందోళనలతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. శ్రీనగర్‌లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. నిజంగా సాధారణ పరిస్థితులే నెల కొంటే, అంతమందిని ఎందుకు జైల్లో పెట్టారు. వారిని విడుదల చేయాలి కదా? మరి ఎందుకు విడదల చేయటం లేదు? ముగ్గురు ముఖ్య మంత్రులను ఇంకా నిర్బంధంలోనే ఉంచారు. స్కూల్‌ తెరిచామని చెబు తున్నారు. అది పూర్తిస్థాయిలో జరగలేదు. కొన్ని స్కూల్స్‌ తెరిచారు. కానీ పిల్లల్నిస్కూల్స్‌కు పంపించేందుకు తల్లిదండ్రులు సాహసించటం లేదు. ఎందుకంటే భయంతో బిక్కుబిక్కు మంటున్నారు. తమ పిల్లల్ని స్కూల్స్‌ పంపిస్తే, మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తారా? లేదా? అనే భయం నెలకొంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇటీవలి ప్రభుత్వం అరెస్టు చేసిన వారిలో చిన్నారు కూడా ఉన్నారు. కనుక తమ పిల్లలు స్కూల్స్‌కి వెళ్తే, ప్రభుత్వం ఎత్తుకెళ్తుందేమోనని భయం పడుతున్నారు.

మహిళల ముందున్న సవాళ్లేంటీ. ?
ఆర్టికల్‌ 370 రద్దు మా సంస్కృతిపై దాడి జరిగింది. అలాగే లైంగికదాడులు పెరుగుతాయి, ఉద్యోగాలు కోల్పోతాం. మా పరిస్థితిని ఎలా చెప్పడం తెలియటం లేదు. మమ్మల్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం యోచించటం లేదు. ఈ పరిస్థితి తమకు మరిన్ని సమస్యలను పరిచయం చేస్తాయి.

మహిళా ఉద్యమం ఎలా ఉంది?
జమ్మూకాశ్మీర్‌లో మహిళ ఉద్యమం చాలా తక్కువగా ఉంది. కొన్ని పోరాటాల్లో మహిళలు పాల్గొంటున్నారు. ఉమెన్‌ టీచర్స్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూటీఎఫ్‌ ఐ) ఉన్నది. మహిళా టీచర్లు ఈ సంఘం కింద పని చేస్తున్నారు. నేను (సోనియా జంవాల్‌) కూడా ఆ సంఘం నుంచే వచ్చాను. ఈ సంఘం జాతీయ స్థాయిలోని ఎస్టీఎఫ్‌ ఐకి అనుబంధంగా పని చేస్తుంది. జమ్మూకాశ్మీర్‌లో ఐద్వా కూడా లేదు. ఈ మహాసభల స్ఫూర్తితో, అక్కడకు వెళ్లాక… అతి త్వరలోనే ఐద్వాని ఏర్పాటు చేస్తాం. మహిళ ఉద్యమం బలోపేతానికి కృషి చేస్తాం.

(Courtesy Nava Telangana)

Leave a Reply