‘బల్ల’గుద్ది చెబుతున్నా.. మీకు పనిచేయను

0
94

పీఎంవోకు టేబుల్‌ తయారు చేసేందుకు కునాల్‌ మర్చంట్‌ నో

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఫోన్‌ వచ్చిందంటేనే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక అలాంటిచోట ఉంచేందుకు చరిత్రలో నిలిచిపోయేలా ‘ఓ ప్రత్యేక బల్ల’ తయారీకి అవకాశం ఇస్తే ఆనందంగా స్వీకరిస్తారు. కానీ, ప్రముఖ ఫర్నీచర్‌ డిజైనర్‌ కునాల్‌ మర్చంట్‌ మాత్రం నిర్ద్వందంగా తిరస్కరించారు. ప్రతిగా నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ జవాబిచ్చారు. ఇప్పుడీ విషయం తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకూ ఏం జరిగిందంటే.. పీఎంవోలో శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక బల్ల (టేబుల్‌) తయారీ కోరుతూ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వివేక్‌ కుమార్‌ ఇటీవల కునాల్‌కు లేఖ రాశారు. డిజైనింగ్‌ రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రధాని మోదీ ఈ అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిని తిరస్కరిస్తూ కునాల్‌ తీవ్రమైన అభ్యంతరాలతో లేఖ రాశారు. దేశంలో 20 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని ప్రస్తావించారు. పీఎంవో ప్రతిపాదనను ఒప్పుకొంటే.. దళితులు, కుటుంబం, మైనార్టీలు, ఎల్జీబీటీక్యూ సమూహానికి ద్రోహం చేసినవాడిని అవుతానని పేర్కొన్నారు. 22 శాతం జనాభా ఉన్న ముస్లింలను సమాజం నుంచి మరింత వేరు చేసేలా మోదీ సర్కారు తీసుకునే నిర్ణయాలకు వేదికగా నిలిచే టేబుల్‌ను తయారు చేయబోనని స్పష్టం చేశారు. తనకుతాను గాంధేయ వాదినని చెప్పుకొంటూ.. అహింసా విధానం, సత్యాగ్రహం పట్ల విధేయతను ప్రకటించారు.

Leave a Reply