పక్కా ప్రణాళికతోనే.. లఖీంపూర్‌ ఖీరీ ఘటన

0
184
  • స్పష్టం చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ
  • సాధారణ సెక్షన్లను మార్చాలని సిఫారసు
  • చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు నివేదిక
  • కేంద్రం తీరుపై రాహుల్‌, ప్రియాంక ధ్వజం
  • మిశ్రాను తొలగించాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : లఖీంపూర్‌ ఖీరీలో అక్టోబరు 3న జరిగిన హింసాకాండ ‘ప్రణాళికాబద్ధమైన కుట్ర’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిగ్గు తేల్చింది. నిందితులపై నమోదు చేసిన అభియోగాల్లో పేర్కొన్న కొన్ని ఐపీసీ సెక్షన్లను మార్చాలని సిఫారసు చేసింది. ఈ మేరకు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌(సీజేఎం)కు నివేదికను అందజేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా.. ఆ రోజు ఆయన ఉద్దేశపూర్వకంగానే తన ఎస్‌యూవీని రైతులపైకి ఎక్కించారని సిట్‌ స్పష్టం చేసింది. రైతులను చంపాలనే ఉద్దేశంతోనే.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే.. ఈ కుట్రకు పాల్పడ్డారని తెలిపింది. వాహన బీభత్సం కారణంగా నలుగురు చనిపోగా.. తదనంతర ఘర్షణల్లో ఓ జర్నలిస్టు, ఇద్దరు బీజేపీ వర్కర్లు లఖీంపూర్‌ ఖీరీలో అక్టోబరు 3న జరిగిన హింసాకాండ ‘ప్రణాళికాబద్ధమైన కుట్ర’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిగ్గు తేల్చింది. నిందితులపై నమోదు చేసిన అభియోగాల్లో పేర్కొన్న కొన్ని ఐపీసీ సెక్షన్లను మార్చాలని సిఫారసు చేసింది.

ఈ మేరకు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌(సీజేఎం)కు నివేదికను అందజేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా.. ఆ రోజు ఆయన ఉద్దేశపూర్వకంగానే తన ఎస్‌యూవీని రైతులపైకి ఎక్కించారని సిట్‌ స్పష్టం చేసింది. రైతులను చంపాలనే ఉద్దేశంతోనే.. ఈ కుట్రకు పాల్పడ్డారని తెలిపింది. వాహన బీభత్సం కారణంగా నలుగురు చనిపోగా.. తదనంతర ఘర్షణల్లో ఓ జర్నలిస్టు, ఇద్దరు బీజేపీ వర్కర్లు సహా.. కేంద్ర మంత్రి వ్యక్తిగత సిబ్బంది ఒకరు మృతిచెందారు. దీనిపై ఆశిష్‌ మిశ్రా సహా.. పలువురు నిందితులపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని హత్య, కుట్ర వంటి తీవ్ర అభియోగాలతోపాటు.. నిర్లక్ష్య డ్రైవింగ్‌, అజాగ్రత్త వంటి పలు తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ సెక్షన్లలో శిక్షలను జరిమానాతో సరిపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో.. తేలికపాటి సెక్షన్లను తొలగించి, హత్యాయత్నం, హింస, మారణాయుధాలతో దాడికి యత్నించడం వంటి తీవ్ర అభియోగాలను చేర్చాలని న్యాయమూర్తికి ఇచ్చిన నివేదికలో సిట్‌ అధికారి విద్యారామ్‌ దివాకర్‌ కోరారు. లఖీంపూర్‌ ఘటనకు నిరసనగా విపక్షాలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు దర్యాప్తు తీరును ఎండగట్టింది. పోలీసుల తీరుపై దుమ్మెత్తి పోసింది. దీంతో ఉత్తరప్రదేశ్‌ సర్కారు సిట్‌తో దర్యాప్తును ముమ్మరం చేసి ఆశిష్‌ను అరెస్టు చేసింది.

మోదీది రైతు వ్యతిరేక వైఖరి: ప్రియాంక
సిట్‌ నివేదిక వెలుగులోకి రావడంపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనతో ప్రధాని మోదీది రైతు వ్యతిరేక వైఖరి అనే విషయం స్పష్టమైందని ఆమె ఆరోపించారు. రైతుల హత్యకు కారణమైన నిందితుడి తండ్రిని ఇంకా మంత్రివర్గంలో కొనసాగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను భర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ ఘటన ప్రణాళికబద్ధమైన కుట్ర అని తేలిన నేపథ్యంలో ప్రధాని మరోమారు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) కూడా కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను భర్తరఫ్‌ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది.

Courtesy Andhrajyothi

Leave a Reply