చిన్నారుల్లో తీవ్రంగా పోషకాహార లోపం

0
351
  • కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆర్నెళ్ల నుంచి ఆరేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో 9.2 లక్షల మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం పరిధిలో వచ్చిన ఓ దరఖాస్తుకు స్పందిస్తూ.. కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం, గత ఏడాది నవంబరు నాటికి ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో దాదాపు 4 లక్షల మంది, ఆ తర్వాత బిహార్‌లో 2.7 లక్షల మంది తీవ్ర పోషకాహార లోపంతో ఇబ్బందిపడుతున్నట్టు పేర్కొంది. లద్దాఖ్‌, లక్షదీవులు, నాగాలాండ్‌, మణిపూర్‌, మధ్యప్రదేశ్‌లోని చిన్నారుల్లో తీవ్ర పోషకాహార సమస్యలు లేవని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఈ సమాచారం సేకరించింది.

Courtesy Andhrajyothi

Leave a Reply