సామాజిక తత్వవేత్త ఊసా కు నివాళి ఇవ్వటమంటే….
పీడిత ప్రజలను ప్రేమించటం.
సమాజంలోని కుల, వర్గ దోపిడీ పీడనలను గుర్తించటం.
కుల రహిత ,వర్గ రహిత సమ సమాజాన్ని కాంక్షించటం.
కుల,వర్గ జమిలి పోరాటాల అవసరాన్ని ఎలుగెత్తి చాటటం.
కుల, వర్గ పోరాటాలకు మార్క్స్ – అంబేడ్కర్ లను రెండు కళ్లుగా భావించటం.
కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకోవటం.
అంబేడ్కరిస్ట్ ల ఐక్యతను కోరుకోవటం.
లాల్, నీల్ ఐక్యతకై నినదించటం.
శత్రు, మిత్ర వైరుధ్యాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం.
మిత్రుల మధ్య ఐక్యతను పెంపొందించటం.
ప్రగతిశీల శక్తుల మధ్య ఐక్యతను నెలకొల్పటం.
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయటం.
బహుజన సమగ్ర సామాజిక విప్లవంలోకి అన్ని పీడిత కులాల, పీడిత వర్గాల, పీడిత మతాల ప్రజలను సమీకరించి బలమైన శక్తిగా ఎదగటం.
బహుళ బహుజన రాజ్యాధికారాన్ని సాధించటం.
పై వాటి కోసం అవిశ్రాంతంగా కృషి చేయటమే ఊసా వంటి బహుజన మేధావులకు మనం ఇచ్చే పరిపూర్ణ నివాళి.
మార్క్సిజం వర్ధిల్లాలి!
అంబేడ్కరిజం వర్ధిల్లాలి
లాల్, నీల్ ఐక్యత వర్ధిల్లాలి!
మైత్రీతో
కృష్ణార్జునరావు