టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇద్దాం!

0
227
  • ‘సాగర్‌’పై సీపీఐ-సీపీఎం జిల్లా కమిటీల నిర్ణయం
  • బహిరంగంగా ప్రకటించొద్దు.. ప్రచారం చేయొద్దు
  • ఓట్లు మాత్రం బదలాయించాలని శ్రేణులకు సూచన
  • ఆమోదించాలని రాష్ట్ర కమిటీలను కోరిన నేతలు
  • ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర నాయకత్వాలు

హైదరాబాద్‌/నల్లగొండ : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ దగ్గర పడుతున్నా.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించాలనే అంశంపై వామపక్షాలు ఇంకా తేల్చుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు కంచుకోటగా నిలిచిన నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం కమ్యూనిస్టులు నామమాత్రంగా మిగిలిపోవడంతో.. ఎవరో ఒకరికి మద్దతివ్వాలనే యోచనలో ఉన్నాయి. అయితే జాతీయ స్థాయిలో వామపక్షాల రాజకీయ విధానం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఈ మేరకు కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవడం, లేదంటే స్థానిక నేతల అభిప్రాయం మేరకు ప్రాంతీయ పార్టీలకు మద్దతు ప్రకటించేలా వె సులుబాటు ఉంది. సీపీఐ-సీపీఎం ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకోవాలని వాటి జాతీయ నాయకత్వాలు నిర్దేశించాయి. దీంతో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వాలనే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తొలినుంచి ప్రచారం జరిగింది. తమ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకత్వాలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ, దీనిపై వామపక్షాల నేతలు నిర్ణయం తీసుకోకముందే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి భగత్‌కు మద్దతివ్వాలని నల్లగొండ జిల్లాలోని ఉమ్మడి కమ్యూనిస్టు నాయకత్వం నిర్ణయించింది. దీనిని మీడియాకు ప్రకటించకూడదని, టీఆర్‌ఎస్‌ తరఫున బహిరంగంగా ప్రచారం చేయకుండా.. కేడర్‌తో మాట్లాడి ఓట్లను బదలాయించాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడే అవకాశం లేదని, ఆ స్థానంలోకి బీజేపీ రాకుండా అడ్డుకోవాలంటే టీఆర్‌ఎ్‌సకు మద్దతివ్వడం అనివార్యమని జిల్లా నేతలు ప్రకటించినట్లు తెలిసింది. దీనిపై కిందిస్థాయి కేడర్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

రెండు పార్టీల భిన్న వైఖరులు!
స్థానిక అవసరాలకు అనుగుణంగా టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని ఆమోదించాలంటూ నల్లగొండ జిల్లా వామపక్షాల నేతలు రాష్ట్ర నాయకత్వాలను కోరినట్లు  తెలిసింది. కానీ, అధికార పార్టీకి మద్దతు ఇస్తే.. భవిష్యత్తులో తమ పోరాటాలకు ప్రజల మద్దతు కూడగట్టడం కష్టమవుతుందని అవి ఎటూ తేల్చుకోలేపోతున్నట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ నాయకత్వం అంగీకరించే అవకాశం ఉన్నా.. రెండు వామపక్ష పార్టీల్లో ఒకటి టీఆర్‌ఎ్‌సకు, మరోటి కాంగ్రె్‌సకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. సీపీఎం ఇప్పటికే తమ విధానాన్ని సీపీఐ నేతలకు స్పష్టం చేసినట్లు, సీపీఐ నేతలు మాత్రం మరికొంత సమయం కోరుతున్నట్టు తెలిసింది.

Courtesy Andhrajyothi

Leave a Reply