లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయపరిమితి పెంపు

0
437

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయ పరిమితిని పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లోక్‌సభ అభ్యర్ధుల వ్యయం 70 లక్షల రూపాయలనుంచి 95 లక్షల రూపాయలకు, అసెంబ్లీ అభ్యర్ధుల ఖర్చు రూ. 28 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెంచారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ అభ్యర్ధుల వ్యయం రూ. 54 లక్షల నుంచి 75 లక్షల రూపాయలకు, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయ పరిమితి రూ. 20 లక్షల నుంచి 28 లక్షల రూపాయలకు పెంచారు.

Leave a Reply