మారడోనా రేప్‌ చేశాడు..

0
273
  • క్యూబా మహిళ ఆరోపణ

బ్యూన్‌సఎయిర్స్‌: ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా చనిపోయి ఏడాదవుతున్నా అతడిని ఇంకా వివాదాలు వీడడం లేదు. తాను టీనేజ్‌లో ఉండగా మారడోనా రేప్‌ చేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేశాడని క్యూబాకు చెందిన 37 ఏళ్ల మావిస్‌ అల్వరెజ్‌ ఆరోపించింది. ‘డ్రగ్స్‌ చికిత్సలో భాగంగా 2001లో 40 ఏళ్ల డీగో క్యూబాకు వచ్చాడు. అప్పుడు నాకు 16 ఏళ్లు. ఆ సమయంలోనే నేను అతడిని కలిశా. కొన్ని రోజుల తర్వాత అతను  డ్రగ్‌ ఎడిక్షన్‌కు చికిత్స తీసుకుంటున్న హవానాలోని ఓ క్లినిక్‌లో బలంగా నోరు మూసి అత్యాచారం చేశాడు.  నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మారడోనా నా  బాల్యాన్ని ఛిద్రం చేశాడు.  అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ కాస్ర్టోకు మారడోనాతో ఉన్న స్నేహం కారణంగా నేను తప్పనిసరి పరిస్థితుల్లో అతడితో నాలుగైదేళ్లు సహజీవనం చేయాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉన్నా మా కుటుంబ సభ్యులు కూడా అంగీకరించాల్సివచ్చింది.

నాకు డ్రగ్స్‌ కూడా అలవాటు చేశాడు. ఇలా నేను.. చిత్రహింసలకు గురయ్యా. దీంతో అతడంటేనే అసహ్యం ఏర్పడింది’ అని సోమవారం మీడియా సమావేశంలో  పేర్కొంది. ఈ సందర్భంగా మారడోనాతో తాను కలిసున్న ఫొటోలను ఆమె విడుదల చేసింది. కాగా గతవారమే తనకు జరిగిన అన్యాయంపై అర్జెంటీనా న్యాయ మంత్రిత్వ శాఖకు వాంగ్మూలం ఇచ్చింది.

Courtesy Andhrajyothi

Leave a Reply