మైనర్‌పై 10 రోజులుగా అత్యాచారం

0
213
మైనర్‌పై 10 రోజులుగా అత్యాచారం
  •  ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

పంజగుట్ట : తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పదమూడేళ్ల బాలికపై పదిరోజులుగా అత్యాచారం చేస్తున్నాడోతల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పదమూడేళ్ల బాలికపై పదిరోజులుగా అత్యాచారం చేస్తున్నాడో కామాంధుడు! బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పంజగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న దంపతులకు ఒక కుమార్తె (13) ఉంది. తల్లి ఇళ్లలో పనిచేసుకుంటుండగా.. తండ్రి పాల వ్యాపారం చేస్తూ డబ్బు వసూలుకు సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్తాడు. వారు ఉండే బస్తీలోనే నివాసం ఉంటున్న జహంగీర్‌ అనే యువకుడు ఈ విషయాన్ని గమనించాడు. తల్లిదండ్రులిద్దరూ రోజూ బయటకు వెళ్లేసమయంలో ఆ బాలిక ఒంటరిగా ఉంటోందని గుర్తించాడు.

ఆమె పాఠశాలకు వెళ్లి వచ్చేటప్పుడు పలుకరించడం ప్రారంభించాడు. పదిరోజుల క్రితం.. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి రోజూ ఆమెపై అఘాయిత్యాన్ని కొనసాగించాడు. మంగళవారం బయటకు వెళ్లివచ్చిన తల్లిదండ్రులకు.. బాలిక నీరసంగా కనిపించడంతో ఏమైందని అడిగారు. దీంతో ఆమె భయపడుతూనే.. జహంగీర్‌ చేస్తున్న అఘాయిత్యం గురించి చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జహంగీర్‌ పరారీలో ఉన్నాడు.

Courtesy Andhrajyothi

Leave a Reply