ప్రచారాలకు కోట్లు.. కేటాయింపులకు పాట్లు

0
49

పలు పథకాల విషయంలో మోడీ సర్కారు తీరు

న్యూఢిల్లీ : 2014లో ప్రధాని అయిన తర్వాత తొమ్మిదేండ్లలో నరేంద్ర మోడీ అనేక ప్రధాన పథకాలను ప్రారంభించారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నుంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే వరకు ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వం అనేక ప్రచారార్బాటాలు చేసింది. అయితే, క్షేత్ర స్థాయిలో వాటికి చేసే కేటాయింపులు ప్రతి బడ్జెట్‌ లోనూ తగ్గటం గమనార్హం.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కోసం, బహిరంగ మలవిసర్జనను నిర్మూలించడా నికి, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగు పర్చటానికి 2014లో భారత ప్రభుత్వం ప్రారంభిం చిన దేశవ్యాప్త ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం 2017 కేంద్ర బడ్జెట్‌లో 16,248 కోట్లు కేటాయించింది. దీనిని 2018 బడ్జెట్‌లో రూ. 17843 కోట్లకు మోడీ సర్కారు పెంచటం గమనార్హం.

ఉజ్వల యోజన
2016 మే నెలలో యూపీలోని బల్లియాలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ని ప్రధాని ప్రారంభించారు. ఇది కట్టెలు, బొగ్గు ఇలా సాంప్రదాయ వంట ఇంధనాలను ఉపయోగిస్తున్న గ్రామీణ, నిరాశ్రయులైన కుటుంబాలకు ఎల్పీజీ వం టి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులో ఉం చే లక్ష్యంతో ఒక ప్రధాన పథకం. ఈ పథకం కింద మార్చి 2020 నాటికి 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను అణ గారిన కుటుంబాలకు అందించటం లక్ష్యం. 2017 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 2,253 కోట్లు కేటాయి ంచారు. 2022 కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపు రూ. 800 కోట్లకు పడిపోవటం గమనించాల్సిన అంశం.

పీఎం కిసాన్‌
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనను ప్రవేశపెట్టింది. ఇది భారత ప్రభుత్వం నుంచి వంద శాతం నిధులతో నడిచే కేంద్ర పథకం. ఈ పథకం 2018లో అమలులోకి వచ్చింది. భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6 వేల ఆదాయ మద్దతు అందించబడుతుంది. ప్రభుత్వం 2017 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 75వేల కోట్లు కేటాయించింది. అయితే, గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు రూ. 19 వేల కోట్లకు పడిపోవటం గమనార్హం.

ముద్రా యోజన
దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయటానికి, కార్పొరేట్‌, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు 10 లక్షల వరక రుణాలు అందించటానికి ప్రధాన మంత్రి ముద్ర యోజనను ప్రారంభించారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, ఎంఎఫ్‌ఐలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాలు పీఎం ఎంఎవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించబడ్డా యి. 2017 నుంచి 2023 వరకు ఈ పథకం కింద రూ. 17.47 లక్షల కోట్లు పంపిణీ చేశారు. 2022 బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ పథకానికి కేవలం వంద కోట్లే కేటాయించటం గమనించాల్సిన అంశం.

Leave a Reply