ఆధునిక ఉపాలి ఉ.సా.కు ముంబైకర్ల నివాళ్లు!

0
851

ఉ. సాంబశివరావు ఉర్ఫ్ ఉసా జులై 25 న హైదరాబాద్ లో నిర్వాణం చెందారు. ఆయన నిర్వాణం మా బహుజనశ్రామిక లోకం జీర్ణించుకోలేక పోయింది.

ముంబైలోని ఆయన అనుచరుల సంస్థ ఇన ఆనాటి ముంబై తెలుగు దళిత ఫెడరేషన్, నేటి ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం (AIAYS) ప్రగాఢ సంతాపాన్ని తెల్పుతుంది.

16 -04-1999 లో గుర్రం జాషువా జయంతి నిమిత్తంగా, పశ్చిమ గోరేగావ్ ఆజాద్ మైదాన్ లో ఉసా గారిని కాన్షిరం తో పాటు ముంబైకి మేము పిలవడం జరిగింది. ఇద్దరు ఒకే స్టేజి పై బహిరంగ సభలో పాల్గొని ముంబైకర్లకు చారిత్రాత్మక సందేశాన్ని ఇచ్చారు.

ఉసా గారు ఆంధ్రా వ్యక్తిఐ ఉండి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన మంగలి/ నాయి ఎంబీసీ ఐ ఉండి మైనార్టీ ఎస్సీ ఎస్టీ లకు మార్గదర్శనం చేస్తూ అండగా నిల్చేవారు. సాంప్రదాయ కమ్యూనిస్టులకు బుద్ధుడు ఫూలే అంబేడ్కర్ల సిద్ధాంత పాఠాలు నూరి పోసిన మహోపాధ్యాయులు. గౌతమ బుద్ధుని వలే పీడిత బహుజనుల మధ్య నిరంతరం దోపిడీ (దు:ఖం) వ్యవస్థకు విరుద్ధంగా సమత మమతల రాజ్యం కోసం నలభై ఏండ్ల పాటు త్యాగం చేసిన మహానీయులు. నేటి యుగానికి ఉసా గారు బుద్ధుని శిష్యులు ఉపాలి నాయి గా మనందరికీ ఆదర్శం. ఆయన ఆచరణ మనందరికీ మార్గం.

నివాళ్ళు అర్పిస్తున్నవారు బత్తుల లక్ష్మణరావు (ఆనాటి సభ నిర్వాహకులు, ఈస్ట్ గోదావరి), వి.వి.వి. సత్యనారాయణ, AIAYS అధ్యక్షులు బి.బి రాజు, ప్రధాన కార్యదర్శి సంటి శంకర్ మహారాజ్, వి.జె రావు, వడ్డీ సూర్యనారాయణ, బి.హేమంత్ కుమార్, మూల్ నివాసి మాల తదితర్లు ఉన్నారు.

Leave a Reply