గుంటూరు: బహుజన మేధావి, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సాంబశివరావు(ఉ. సా. ) సంతాప సభ పాత గుంటూరు నాయిబ్రాహ్మణు హాస్టల్ నందు నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు తాటికొండ నరసింహరావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది.
ఈ సభలో రాష్ట్ర రజక జనసేవ సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం ఉద్యమించిన సాంబశివరావు గారి ఆశయ సాధనకు నాయి బ్రాహ్మణులు, రజకులు కలిసి పనిచేయాలన్నారు. బహుజన ఉద్యమం ముందుకు తీసుకెళ్లేందుకు రజకుల అందరూ కలిసి పని చేసి రాజ్యాధికారం సాధించడమే సాంబశివ రావు గారికి నిజమైన నివాళి అని జూపూడి తెలిపారు.
సాంబశివ రావు గారికి ఘన నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో లో చందోలు శోభారాణి హై కోర్ట్ అడ్వకేట్ నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పలకలూరు శివరావు పాల్గొన్నారు.