వంగపండుకి మరణం లేదు

0
325

తూర్పుకనుమల్లో ఊపిరిపోసుకున్న ఉత్తరాంధ్ర పాటల సూరీడు
వంగపండు పాటకు మరణం లేదు
ఉత్తరాంధ్ర మాండలికాన్ని ..మట్టివాసనను ప్రపంచానికి చాటిచెప్పిన
వంగపండు మాటకు మరణం లేదు
శ్రీకాకుళ సాయుధ పోరాటంలో విప్లవ జ్వాలను రగిల్చిన
వంగపండు చైతన్యానికి మరణం లేదు
గిరిజనుల దుర్గతిని
కార్మికుడి శ్రమని
కర్షకుడి కష్టాన్ని
పేదల ఆకలిని
ఉత్తరాంధ్ర వెనుకబాటుని.
వెక్కి వెక్కి ఏడ్చేవలస వెతలను వినిపించిన
వంగపండు గళానికి మరణం లేదు
రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల చెమట కష్టాన్ని కలంతో కళ్లకు కట్టిన
వంగపండు కలానికి మరణం లేదు
ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన చైతన్యదీప్తి
వంగపండు గజ్జకి మరణం లేదు
ఏం పిల్లడో ఎల్దమొస్తవా…అన్న
వంగంపండు పిలుపుకి మరణం లేదు
ఉత్తరాంధ్ర గడ్డ మీద పురుడుపోసుకున్న ప్రతీ కలానికి, గలానికి స్ఫూర్తి
వంగపండు సాహిత్యానికి మరణం లేదు
విజీనగరం కీర్తిని విశ్వవ్యాప్తంగా విరాజిల్లేలా చేసిన
వంగపండు కీర్తికి మరణం లేదు
పాముని చంపిన చీమలున్నయట…
పులుల్ని మింగిన మేకలున్నయట…
తుపాకీ పేల్చిన తూరీగలున్నయట..అన్న
వంగపండు భావజాలానికి మరణంలేదు
శ్రీకాకుళంలో చీమ కొండ కి మరణం లేదు
సాలూరవతల సవర కొండకి మరణం లేదు
తూరుపు దిక్కున దోర కొండకి మరణం లేదు
పేదల సాహిత్య శిఖరం వంగపండుకి మరణం లేదు
కన్నీటి నివాళితో…

నిద్దాన సతీష్
ఉత్తరాంధ్ర

Leave a Reply