నిర్భయం ఎక్కడ?

0
260

దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబరు 16న చోటుచేసుకున్న అత్యాచార ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం కఠినమైన నిర్భయ చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రాలూ తమ పరిస్థితులకు అనుగుణంగా సొంత చట్టాలు రూపొందించాయి. మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు, దళాలను ఏర్పాటుచేశాయి. అయినా మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు. సరికదా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ శివారులో, వరంగల్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలే ఇందుకు నిదర్శనాలు. 2012కన్నా ముందు అత్యాచారాలపై ఫిర్యాదుచేయడానికి మహిళలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక ఫిర్యాదులు, శిక్షల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ అత్యాచారాలూ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2017 సంవత్సరం వరకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి. (2018, 2019  గణాంకాలు ఇంకా వెల్లడికాలేదు).

Courtesy Eenadu..

Leave a Reply