వలస కార్మికుల సమాచారం లేదు..

0
235

– పార్లమెంట్‌లో ఎంపీల ప్రశ్నలకు కేంద్రం జవాబు
– ఇది ఊహించని మానవ సంక్షోభం..
– మృతిచెందిన వలసకార్మికుల వివరాల్లేవు : కేంద్ర మంత్రి గాంగ్వార్‌
– పార్లమెంట్‌లో ఎంపీల ప్రశ్నలకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ : వలస కార్మికుల సమస్యలపై పార్లమెంట్‌లో ఎంపీలు ప్రశ్నల వర్షం కురిపించారు. వేటికి కూడా కేంద్రం స్పష్టమైన సమాధానమివ్వకుండా ఇది ఊహించని మానవ సంక్షోభం..అని ప్రకటించి తప్పించుకుంది. లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కోట్లమంది వలస కార్మికులు రోడ్డుపాలయ్యారు. జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. ఆకలి, ఆందోళనతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ఎంతోమందిని కలిచివేసింది. స్వగ్రామాలకు తరలివెళ్తుండగా వారు పడ్డ కష్టాలు, నష్టాలు…ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంది? అని పలువురు ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీశారు. అయితే ఈ అంశంపై కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌ ఇచ్చిన సమాధానంతో సభ్యులు నివ్వెరపోయారు. ‘ఇది ఎవరూ ఊహించని మానవ సంక్షోభం’, ‘వలస కార్మికుల మరణాలు, ఇతర సమాచారం మా వద్ద లేదని’ ఆయన వెల్లడించటంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది వలస కార్మికులకు రేషన్‌ సరుకులు ఉచితంగా అందజేశారని ప్రశ్నించగా, రాష్ట్రాల వారీగా తమ వద్ద సమాచారం లేదని గాంగ్వార్‌ తెలిపారు.

Leave a Reply