నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు : చెన్నకేశవులు తల్లి

0
399

మహబూబ్‌నగర్‌ : ప్రియాంకను ఎలా చంపారో.. తన కొడుకును కూడా అలాగే చంపినా ఫర్వాలేదని ప్రియాంకారెడ్డి హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాకు తెలిపారు. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ మాట్లాడారు. ‘నా కొడుకు ఇట్లా చేస్తాడనుకోలేదు. లవ్‌ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. వాడికి కిడ్నీ పాడైంది. జక్లేర్‌ వ్యక్తి(మహ్మద్‌ ఆరిఫ్‌)తో స్నేహం చేసిన తర్వాతే పాడైపోయాడు. లారీ లోడ్‌ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరికీ ఒకటే బాధ. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు.

పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపుర్రి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు.

నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే. అందరిదీ అదే బాధ’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Courtesy Prajasakthi

 

Leave a Reply