వరికెందుకు ఉరి…?

0
47

– సీఎం ప్రకటనతో రైతుల్లో ఆందోళన
– ప్రత్యామ్నాయంపై ముందు చూపులేదు..
– వరిమడులు మార్చాలంటే వ్యయప్రయాసే
– లక్షలకోట్లతో నిర్మిస్తున్న కాలువలు, ప్రాజెక్టుల సంగతేంటి? – మద్దతు ధరల ప్రకటన లేకుంటే ఆదేశాలు
– కేంద్రాన్ని ఎదిరించలేక రైతులను ఇబ్బంది పెడతారా?
– నిపుణులు, రైతుసంఘాల నేతల ఆందోళన

హైదరాబాద్‌ : ‘ఇక వరి వేస్తే రైతులకు ఉరే’ అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య లు రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపుతు న్నాయి. ‘వ్యవసాయం చేయ డమంటే ఒక మిషన్‌ ఆన్‌ చేసినట్టు కాదు. వరి వేయొద్దంటే మరి లక్షల కోట్ల రూపాయలతో కడుతున్న ప్రాజెక్టులు, కాలువల సంగ తేంటి? ప్రత్యామ్నాయ పంటలపై ముందుచూపేది? వ్యవసాయంపై నిర్ధిష్ట ప్రణాళికలేవి?’ అంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు గరగరం అవుతు న్నారు. అదే సమయంలో అన్నదాతలూ అయోమ యానికి గురవుతున్నారు. నిరంతరం నీరుపారే వరిపోలాల ను వెంట నే ఆరుతడి పంటలకు మార్చటమన్నది. వ్యయప్రయాసలతో కూడు కున్నది. పోనిలే వరిమానేసి, పల్లీలు, నూనె గింజలు, పొద్దుతిరు గుడు, నూవ్వులు, మెక్కలు, పెసర, ఉల్వలు, కూరగాయలు, పండ్లతో టలు వేద్దామంటే వాటికి ధర గ్యారంటీ లేదు. వరి సాగు వ్యయం ఎక్కువైనా మద్దతు ధర ఉంది. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తారు. మిగతా పంటలకు అలాంటి సౌకర్యమేది? స్పష్టమైన పంటల ప్రణాళికలు ప్రక టించకుండా సీఎం కేసీఆర్‌ ఇష్టానుసారం వ్యవహరిస్తు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను అమలు చేయడంలో భాగంగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుత వున్నాయి. కేంద్రాన్ని ఎదిరించలేక, ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనంటూ బలంగా చెప్పలేక టీఆర్‌ఎస్‌ సర్కారు తన బలహీనతను చాటుకుంటున్నదని విమర్శి స్తున్నారు. సీఎం వ్యాఖ్యలు రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయనీ, వెంటనే ఆ వాటిని వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు

రైతులకు ముందే అవగాహన కల్పించాలి – అరిబండ ప్రసాదరావు, వ్యవసాయ శాస్త్రవేత్త
‘పంటల ప్రణాళిక గురించి రైతులకు ముందే చెప్పాలి. వరిని తగ్గించు కునేం దుకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు సరైన విత్తనాలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి.అందుకు చర్యలు తీసు కోవాలి. కొత్త పంటలకు మార్కెట్‌ వ్యవస్థ లేనప్పుడు ఆ పంటలను ఎవరు కొనాలి? ప్రత్యామ్నాయ పంటలకు మద్దతుధరలు నిర్ణయించాలి’

సీఎం సమస్యను రైతులపై రుద్దుతున్నారు – j వ్యవసాయ రంగ విధాన విశ్లేషకులు
రాష్టంలో రాజకీయాలే తప్ప సంక్షేమమూ, ప్రజాసంక్షేమం లేదు. దేశంలో ప్రజలకు సరిపడినంత వరి ధాన్యం లేదు. పూర్తి అవగాహనలేకుండానే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వరి పంటతో సమస్య వస్తుందని భావిస్తే, సంప్రదింపులు జరిపి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వరి వద్దంటే ఏ పంటలు వేయాలి?. మిశ్రమ పంటలైన రాగులు, జొన్నలు, అరికలు, మంచివే. వాటిని ప్రభుత్వం గుర్తించడం లేదు. సీఎంకు సమస్య ఉంది కాబట్టి వరిని వద్దంటున్నారు. సంప్రదాయ పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. కర్ణాటకలో రాగులకు రూ.2000 మద్ద తుధర ఇస్తున్నారు. ఒడిస్సాలో మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్‌ ఇస్తున్నారు. దీంతో మిల్లెట్స్‌ సాగు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తే వాటిని రైతులు సాగు చేస్తారు.

పంటల ధరలను గ్యారంటీ చేయాలి : టి సాగర్‌, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
‘రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా లేదు. ఆహార ధాన్యాల కోసం సార్వజనీత ప్రజాపంపిణీ ద్వారా గోదాములను ఖాళీ చేయాలి. పండిన పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వరిపండని ప్రాంతాలకు పంపిణీ చేయాలి.దాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు పంపించాలి. వరిసాగుకు అనుకూలంగా అనేక ప్రాజెక్టులు నిర్మితవుతున్నాయి. అవి పూర్తయితే దిగుబడి పెరుగుతుంది. నీళ్లు వస్తే వరి అనివార్యం. కానీ కొనకపోతే రైతులు ఇబ్బందిపడతారు. యాసంగిలో వరి తగ్గించుకోవాలంటే మిగతా పంటలకు మద్దతు ధర గ్యారంటీ చేయాలి. అంతకంటే ముందు పంటల ప్రణాళిక రూపొందించాలి. అప్పుడు ప్రకటన చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబల్కుకుని ఇలాంటి చేయటం దారుణం.

పూటకో మాట మాట్లాడితే ఎట్ట కేసీఆర్‌? : పశ్యపద్మ, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
‘ఒకసారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనీ, మరోసారి చేయబోమనీ, ఆ పంటేయొద్దు ఈ పంటనే వేయాలని సీఎం కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడటం తగదు. భూసార పరీక్షలు చేసి రైతులకు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు ఇవ్వాలి. వరి వద్దని చెబుతున్న సీఎం ఇంకేం పంటలు వేయాలో చెప్పడం లేదు. వాటికి మద్దతు ధరలు ఇస్తరో? లేదో? చెప్పరు. మూకుమ్మడిగా వరి బంద్‌ చేస్తే పరిస్థితులు ఏంటి? రైతులు, నిపుణుల సలహాలు తీసుకోవాలి. పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి’

వరిపొలాన్ని ఇతర పంటలకు అనువుగా మార్చాలంటే చాలా కష్టం : కన్నెగంటి రవి, రైతు స్వరాజ్యవేదిక
‘వరి పొలాలను, ఇతర పంటలకు అనువుగా మార్చాలంటే రైతుకు ఆర్థిక భారం, ఇది చాలా కష్టంతో కూడుకుంది. వరి కాకుండా ఇతర పంటలకు ధరలు, మార్కెటింగ్‌ వ్యవస్థ లేదు. సీఎం చెప్పినట్టు రైతులు ఇతరపంటల్ని ఎందుకు వేస్తారు?సర్కారు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. విత్తనాలు, మందులు, ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి. రాష్ట్ర అవసరాలపై అవగాహన ఉండాలి. అందుకు అనుగుణంగా పంటలను ప్రోత్సహించాలి’

క్రమంగా తగ్గించాలి : కిచ్చెల రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఏఐకేఎంఎస్‌
‘మన దేశంలో వరికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ప్రజలకు అదే జీవనాధారం. క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్ప అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజల అవసరాలేంటి? అనేది చూడాలి. ఆహారధాన్యాలు, పప్పుధాన్యాల కొరతతో దిగుమతి చేసుకుంటున్నాం. రైతులకు సరైన అవగాహన కల్పించాలి ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు కల్పించాలి. వరి వేయొద్దు అంటే ఆ ప్రాజెక్టుల అవసరం లేనట్టేనా? ఈ విషయంలో సర్కారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది’.

వరి వద్దనడం దుర్మార్గం : అచ్యుత రామారావు, అధ్యక్షులు ఏఐకేఎంఎస్‌
‘వరి వద్దనడం దుర్మార్గం. గతంలోనే దొడ్డు రకాలు వేయకూడదనీ, సన్నాలు వేయాలని చెప్పారు. ఇప్పుడేమో అసలే వద్దంటున్నారు. ఇది సరైందికాదు. రైతుల ను భయపెట్టడమే. దీంతో ప్రభుత్వం తన లోపాన్ని బయటపెట్టు కుంది. వరి సాగుకు ఖర్చు పెరిగిపోయింది. మద్దతు ధర రూ 2500 ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల గురించి ఎందుకు చెప్పడం లేదు. ఆయిల్‌ఫామ్‌ సాగుపై ప్రచారం చేస్తున్నది. ఆ రైతులు గిట్టుబాటు ధర లేక దివాళా తీస్తున్నారు. వరివద్దంటున్న సర్కారు బియ్యాన్ని ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలి..’

బలవంత పెట్టడం సరైందికాదు : వల్లపు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఏఐకేఎఫ్‌
‘వరికి సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేయలేక తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుం టున్నది. వరి ధాన్యాన్ని బయటి మార్కెట్లో అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల సరైన గిట్టుబాటు ధర కల్పిం చాలి. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్స హించాలి. ఇవే పంటలు వేయాలంటూ రైతులను బలవంత పెట్టడం సరైంది కాదు’.

అన్ని పంటలను ప్రభుత్వమే కొనాలి : జక్కుల వెంకయ్య, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ సమితి
‘రైతు పండించిన ప్రత్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆయిల్‌ఫాుంను ప్రోత్సహిస్తున్నంతంగా వేరుశనగను ప్రోత్సహించడం లేదు. వాటికి సరైన ధరలు కల్పిస్తామని చెప్పడం లేదు. ఏ పంటకు ఏ నేల అనుకూలంగా ఉందనే అంశాలపై భూసార పరీక్షలు చేయడం లేదు. దీంతో రైతులు ఏదో ఒక పంట వేసి నష్టపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యులు. రైతుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది’.
వరి మడులలో ఇంకే పంట పండదు : మధు, యువరైతు వడియాల గ్రామం, నాగర్‌కర్నూల్‌ జిల్లా
‘వరి వేయొద్దనడం సరైంది కాదు. కాలువ కింద వరిమాడుల్లో వరి తప్ప ఇంకేమీ పండదు. సీఎం మాట ప్రకారం నీళ్లు వచ్చినా ఏమీ లాభం లేదు. వ్యవసాయం చేస్తే రైతులకు ఎటువంటి లాభం లేని పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో సీఎం ఈ విధంగా చెప్పడం సరైంది కాదు’.

Courtesy Nava Telangana

Leave a Reply