తాగునీరు లేక చిన్నారి మృతి

0
16

జోధ్‌పుర్‌: రాజస్థాన్‌లో తాగునీరు దొరక్క అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. రాయ్‌పుర్‌ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి సుకి దేవి భిల్‌ (60) చిన్నారితో బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉండటం, మార్గమధ్యంలో తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల ఉన్నట్టుండి ఇద్దరూ కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Courtesy Eenadu

Leave a Reply