ఇదీ యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌!

0
295

సవాళ్లపై స్పందించ లేదు
కరోనా వచ్చింది ఆ తర్వాతే
కేంద్రానికి పరకాల చురకలు
అమరావతి: దేశ స్థూలఉత్పత్తి వృద్ధిరేటు మైనస్‌ 23శాతంగా నమోదు కావడం మన చేతుల్లో లేని(యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) కరోనా వల్లే ఇలా జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడంపై ఆమె భర్త, ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ తనదైన శైలిలో స్పందించారు.

‘‘ప్రభుత్వం సూక్ష్మ-ఆర్థిక సవాళ్లపై తగిన విధంగా స్పందించకపోవడమే అసలైన యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌! కొవిడ్‌ ఆ తర్వాత వచ్చింది. ఈ పరిస్థితిని గత అక్టోబరులోనే ఊహించాను. కానీ, ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ, తాజాగా జీడీపీ వృద్ధిరేటు పడిపోవడంతో అసలు వాస్తవం తెలిసొచ్చింది. దయచేసి… ఇప్పటికైనా ఆ దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యండి’ అని పరకాల ట్వీట్‌ చేశారు.

Leave a Reply