మామూలు నిఘా కాదు..

0
271

– పెగాసస్‌ వాడలేదని మోడీ సర్కార్‌ ఇప్పటికీ ప్రకటించలేదు..
– భారత్‌కు స్పైవేర్‌ అమ్మలేదని ఎన్‌ఎస్‌ఓ కూడా చెప్పలేదు
– ఐటీ చట్టం ప్రకారం మోడీ సర్కార్‌ దోషి : ‘ద వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజన్‌

న్యూఢిల్లీ : భారత్‌, అమెరికా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌..ఇలా అనేక దేశాల్లో ‘పెగాసస్‌’ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 17 వార్తా సంస్థలకు(ఇందులో ‘ద వైర్‌’ కూడా ఉంది) చెందిన 80 మంది జర్నలిస్టులు ఎంతో శ్రమించి చేసిన పరిశోధనాత్మక జర్నలిజం ‘పెగాసస్‌ ప్రాజెక్ట్‌’. వివిధ దేశాల్లో అక్రమ నిఘా కార్యకలాపాలు, రాజకీయ కుట్ర కుతంత్రాలను ఇది బయటపెట్టింది. జులై 18 రాత్రి 9 గంటలా 30 నిమిషాల తర్వాత ‘పెగాసస్‌ కుంభకోణం’లో మొదటి వార్తా కథనాన్ని ‘ద వైర్‌’ వెలువరించింది. అప్పట్నుంచీ వెలువడుతున్న వరుస వార్తా కథనాల తర్వాత ‘ద వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజన్‌ మరికొన్ని విషయాలు తాజాగా వెల్లడించారు. అవేంటో ఆయన మాటల్లో…

గట్టి ఆధారాలున్నాయి..
ఐటీ చట్టం ప్రకారం మోడీ సర్కార్‌ చేసింది అక్రమ నిఘా కిందకే వస్తుంది. మేం గుడ్డిగా ఈ ఆరోపణలు చేయటం లేదు. పరిశోధన్మాతక జర్నలిజ ంలో లభ్యమైన సమాచారాన్ని అనేక విధాలుగా క్రాస్‌ చెక్‌ చేశాకే నిర్ధారణకు వచ్చాం. అవేంటో చూచా యిగా…1.రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు…అనేక రంగాలకు చెందినవారిని ఎంచుకొని అక్రమంగా నిఘా పెట్టారు. ఇందుకోసం ఎన్‌ఎస్‌ఓ నుంచి సేవలు కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేయలేదని మోడీ సర్కార్‌ స్పష్టంగా చెప్పటం లేదు. 2.ఇజ్రాయెల్‌ మిత్ర దేశాలకు తాము స్పైవేర్‌ (మిల టరీ గ్రేడ్‌) సేవలు అందించామని ఎన్‌ఎస్‌ఓ చెబుతో ంది. భారత్‌కు స్పైవేర్‌ అమ్మలేదని ఎన్‌ఎస్‌ఓ కూడా స్పష్టంగా చెప్పటం లేదు. 3.ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సంస్థ చీఫ్‌ అజిత్‌ దోవల్‌ ఇజ్రాయెల్‌ పర్యట న తర్వాతే ‘పెగాసస్‌’ అక్రమా నిఘా మొదలైందని ఆధారాలున్నాయి. 4.ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) అధికారులు ‘పెగాసస్‌’ను వాడారని మా పరిశోధనాత్మక జర్నలిజంలో తేలింది.

పార్లమెంట్‌లో లొల్లిపెట్టడం కోసం కాదు..
” జులై 19 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయాన్ని చూసుకొని, పార్లమెంట్‌లో గలాటా సృష్టించడానికి కావాలనే ‘పెగాసస్‌ ప్రాజెక్ట్‌’ను తెరమీదకు తీసుకొచ్చారు” అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆయన వాదన అర్ధరహితం, హాస్యాస్పదం. ఎందుకంటే జులై 19న వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని జూన్‌ నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. ఈ సమావేశాల్లో గలాటా చేయాలని, రెండు మూడు వారాల వ్యవధిలో పది దేశాల(అమెరికా, ఫ్రాన్స్‌, భారత్‌, మొరాకో, మెక్సికో..)పై పరిశోధనాత్మక జర్నలిజం పూర్తవుతుందా? లీకైన డేటాలో 50వేలకు పైగా ఫోన్‌ నెంబర్లున్నాయి. భారత్‌కు చెందిన 300కుపైగా ఫోన్‌ నెంబర్లపై పరిశీలన చేశాం.

Courtesy Nava Telangqana

Leave a Reply