దేశంలో ‘నిజాముద్దీన్‌’లెన్నో..!

0
218
  • లాక్‌డౌన్‌ను ధిక్కరించిన వారెందరో..
  • రాష్ట్రపతి భవన్‌ నుంచి కేరళ దాకా అనేకం

న్యూఢిల్లీ : గత నెల 13 నుంచి 15 మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశం కరోనా విస్తరిస్తున్న దశలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టి ఇలా సామూహిక సమావేశాలు నిర్వహించిన దృష్టాంతాలు దేశమంతా అనేకం ఉన్నాయి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభావశీలురైన మహిళలకు సత్కార కార్యక్రమం మార్చి 8న సాక్షాత్తూ రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. అప్పటికే ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక కేరళలో మళయాళీలు అటుకుల్‌ పొంగల్‌ పండుగను మార్చి 8 నుంచి పదిరోజుల పాటు నిర్వహించుకున్నారు. దీంతోపాటు మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించారు. అది అమల్లోకి వచ్చిన తొలిరోజే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో రామ నవమి ఉత్సవాలు నిర్వహించారు.  మార్చి 10-12 మధ్య పంజాబ్‌లో జరిగిన సిక్కుల మత సమావేశంలో ప్రసంగించిన 70 ఏళ్ల ప్రచారకుడు కొవిడ్‌-19తో చనిపోవడం కలకలం రేపింది. దీనికి హాజరైన 13 మందికి వైరస్‌ సోకడం గమనార్హం.

Courtesy Andhrajyothi

Leave a Reply