జోరు తగ్గని పౌర పోరు

0
206
జోరు తగ్గని పౌర పోరు

– సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ
– పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ ,అహ్మదాబాద్‌ : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని సబ్బండ వర్గాల నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌(ఎన్పీఆర్‌)లపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందో ళనలు కొనసాగాయి. ఈ చట్టాలపై గుజరాత్‌లోని విద్యాy ేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని 100 మందికి పైగా రిటైర్డ్‌ బ్యూరోకాట్లు బహిరంగ లేఖను రాశారు. ఇక ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ పౌర నిరసనలు తీవ్రంగా జరిగాయి.

సీఏఏ-ఎన్నార్సీలతో లౌకికవాదానికి ప్రమాదం: గుజరాత్‌లోని విద్యావేత్తల ఆందోళన
వివాదాస్పద సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు చాలా ప్రమాదకరమనీ, అవి దేశ లౌకికవాదాదన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడతాయని గుజరాత్‌లోని విద్యావేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు వారు సంఘీభావం ప్రకటించారు. నిరసనలు తెలిపే క్రమంలో ఆందోళనకారులు, విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు, హింసాత్మక ధోరణిని వారు ఖండించారు. సీఏఏ, ఎన్నార్సీలు దేశంలోని ముస్లింల పట్ల వివక్షతను చూపుతాయనీ, మతాధారిత వివక్ష తావివ్వకూడదని వారు తెలిపారు.

సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి అవసరంలేదు:100 మందికి పైగా రిటైర్డ్‌ బ్యూరోకాట్ల బహిరంగ లేఖ
పౌరసత్వ చట్టం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దేశంలోని 100 మందికి పైగా రిటైర్డ్‌ బ్యూరోకాట్లు ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు వంటివి దేశానికి అవసరం లేదనీ, ఇవి నిరుపయోగమైన ప్రక్రియలు అని పేర్కొన్నారు. వీటితో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగలేఖ రాసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌, ఒకప్పటి క్యాబినేట్‌ సెక్రెటరీ కె.ఎం. చంద్రశేఖర్‌, మాజీ సీఐసీ వజాహత్‌ హబీబుల్లా లు ఉన్నారు. జాతీయ గుర్తింపు కార్డులకు సంబంధించిన పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్లను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌, ఎన్నార్సీలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడతాయనీ, ఫెడరల్‌ స్ఫూర్తికి ప్రమా దకరమని హెచ్చరించారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వీటిని అమలుకు వ్యతిరేకంగా ఉన్నాయనీ గుర్తుచేశారు. సీఏఏతో పాటు ఫారీన్స్‌(ట్రిబ్యునల్స్‌) అమెండ్‌మెంట్‌ ఆర్డర్‌, 2019, నిర్బంధ కేంద్రాల నిర్మాణాలకు సంబంధించిన సూచనలన్నిటినీ వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోరాల్సిందిగా దేశప్రజలకు సూచించారు.

పాట్న హింసాత్మక ఘటన నిందితుడు సరెండర్‌
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గతనెల 21 రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌లో భాగంగా పాట్నలో అమిర్‌ హన్‌జ్లా(18) అనే వ్యక్తిని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు, హిందూ సమాజ్‌ సంగటన్‌ నాయకుడు వినోద్‌ కుమార్‌ ఎట్టకేలకు కోర్టు ముం దు లొంగిపోయాడు. సదరు నేరాన్ని తానే చేసినట్టుగా పోలీ సుల ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. హత్య ఘటన అనంతరం 18 రోజుల పాటు నిందితుడు తప్పించుకు తిరిగాడనీ, చివరకు స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయా డని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. హిందూ సమాజ్‌ సంగ టన్‌ జిల్లా నాయకుడైన వినోద్‌.. గతనెల 21న జరిగిన సీఏ ఏ-ఎన్నార్సీ వ్యతిరేక ర్యాలీలో అమిర్‌ను చంపి పారిపో యాడనీ, ఆ హింసాత్మక ఘటన వెనక ప్రధాన సూత్రధారి ఆయనేనని వివరించారు. ఫుల్వారీ షరీఫ్‌ ర్యాలీలో ముస్లిం లను లక్ష్యంగా చేసుకొని వినోద్‌తో పాటు మరికొందరు దాడికి దిగినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారని వివరించారు.

(Courtesy Nava Telangana)

Leave a Reply