ఏడాదైనా సాయం అందలే

0
261
  • తేరుకోని ‘కొండగట్టు’ బాధితులు..
  • అతి పెద్ద బస్సు ప్రమాదానికి నేటితో ఏడాది..
  • అందని పూర్తి పరిహారం

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగి బుధవారంతో ఏడాది పూర్తవుతుంది. దేశంలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంలో 65 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది క్షతగాత్రులయ్యారు. కాళ్లు, చేతులు విరిగిన వారు ఇంకా కోలుకోలేదు. మృతుల్లో కొడిమ్యాల మండలానికి చెందిన వారే 50 మంది ఉన్నారు. ఘాట్‌ రోడ్డుపై ఇప్పటికీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు. జీబ్రా క్రాసింగ్‌లతో పాటు స్పీడ్‌ బ్రేకర్లను తొలగించి ప్రమాదం జరిగిన చోట అడ్డు కట్ట కట్టి లోయను పూడ్చారు. కొండగట్టు రోడ్డుపైకి భారీ వాహనాలను అనుమతించడం లేదు. రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడంతో పాటు ఫోర్‌ లైన్‌ రోడ్డు వేయాలన్న ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి ఏడాది గడిచినా బాధితులకు ఇంకా అందలేదు.

Courtsey Andhrayothi

Leave a Reply