అదానీ గ్రూపు కోసం చట్టాల బుట్టదాఖలు

0
185

– రమణ్‌సింగ్‌ హయాంలో పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాల ఉల్లంఘన
– ఛత్తీస్‌గఢ్‌లో గ్రామ సభల అనుమతి లేకుండానే భూసేకరణ ప్రక్రియ
– వెంటనే నిలిపేయాలని ఆదివాసీల ఆందోళనలు

రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని 1,700 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల హస్‌దేవ్‌ అరణ్య రీజియన్‌ దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ సంప్రదాయ తెగ ప్రజలు, ఆదివాసీలు నివసిస్తున్నారు. అటవీ సంపదపైనే ఆధారపడి వీరు జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా, మైనింగ్‌ కోసం కన్నేసిన అదానీ గ్రూపు.. సర్కారు అండతో ఈ ప్రాంతాన్ని గుప్పెట్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదానీ గ్రూపు ఒత్తిడితో రమణ్‌ సింగ్‌ ప్రభుత్వం.. చట్టాలను బుట్టదాఖలు చేస్తూ భూసేకరణ ప్రారంభించింది. పెసా, అటవీ హక్కుల యాక్ట్‌ (ఎఫ్‌ఆర్‌ఏ)చట్టాలను బేఖాతరు చేస్తూ గ్రామ సభల అనుమతులు తీసుకోకుండానే ఈ పర్వా న్ని కొనసాగించింది. నకిలీ గ్రామ సభల బాగోతానికి తెర తీసింది. జీవనాధారమైన అడవి ధ్వంసంమవు తుండటంతో ఆదివాసీలు ఏకమై పోరుబాట పట్టారు. హస్‌దేవ్‌ అరణ్య రీజియన్‌లోని దాదాపు 20 గ్రామాల ప్రజలు వారం రోజు లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ రీజియన్‌లో విలువైన గనుల సంపదను గుర్తించిన పర్యావ రణ, అటవీ, పర్యా వరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్‌ సీసీ) ఈ మొత్తం రీజియన్‌ను నో-గో ఏరియాగా 2009లో ప్రకటిం చింది. 2011లో ఎంఓఈఎఫ్‌సీసీ మంత్రి జైరాం రమేశ్‌ మూడు కోల్‌ బ్లాకులు తారా, పార్సా ఈస్ట్‌, కాంటే బాస న్‌లకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ లను ఇచ్చారు. అయితే, అనంతరం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఈ అనుమతుల నూ తోసిపు చ్చింది. అయితే, 2014లో ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ లను తోసిపుచ్చిన ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీం తో మైనింగ్‌ ప్రాసెస్‌ మళ్లీ మొదలైం దని హస్‌దేవ్‌ అరణ్య బచావో సంఘర్ష్‌ సమితి కార్యకర్త అలోక్‌ తెలిపారు. పార్సా ఈస్ట్‌(అదానీ గ్రూపునకు చెందిన మైనింగ్‌ యూనిట్‌)కు మూ డు, నాలుగు నెలల కింద పర్యావరణ అనుమతులనూ సర్కారు ఇచ్చిందని అన్నారు.

చట్టాల ఉల్లంఘన
ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ హయాంలో అదానీ గ్రూపు మైనింగ్‌ కోసం ఇష్టారాజ్యంగా భూసేకరణ ప్రక్రియ జరిగింది. కోల్‌ బేరింగ్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారు. పెసా 1969 చట్టం, భూ సేకరణ చట్టం 2013లూ స్పష్టం గా ఈ ప్రాంతంలో భూసేకరణకు తప్పనిసరిగా ప్రజల అను మతి తీసుకోవాలని సూచిస్తున్నాయి. అటవీ హక్కుల చట్టమూ అదే చెబుతుంది. కానీ, ఈ చట్టాలన్నింటినీ సర్కారు బుట్టదాఖలు చేసిందని అలోక్‌ వివరించారు. ప్రజల అనుమ తి తీసుకోనేలేదు. పర్యావరణ అనుమతుల కోసం దరఖా స్తులు ఎన్విరాన్మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ కమిట ీ(ఈఐఏసీ)కి చేరగా.. అనుమతులిస్తే.. ఆ మైనింగ్‌ ప్రాజెక్టు తో బ్యారేజ్‌, ఎలిఫెంట్‌ కారిడార్‌, భూమిపై పడే ప్రభావా లను సర్కారుకు నివేదించాలని అదానీ గ్రూపును ఆదేశించిం ది. అయితే, ఈ ప్రభావాలను స్థానిక ప్రజలు ఎట్టిపరిస్థి తుల్లో ఒప్పుకోరు. కాబట్టి.. అదానీ గ్రూపు దొడ్డిదారిన అను మతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఆ సంస్థ ఒత్తిడితో జిల్లా అధికారులు నకిలీ గ్రామ సభలు నిర్వహిం చారని అలోక్‌ తెలిపారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర సర్కారు వైఖరిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు కోల్‌ బ్లాక్‌ విక్రయాలు లేదా కేటాయింపులు కేంద్ర సర్కారు చేతిలో ఉండగా.. దాని ప్రాసెస్‌, భూసేకరణ, అటవీ, పర్యా వరణ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ తీరుతె న్నులను రాష్ట్ర సర్కారు నిర్దేశిస్తుంది. పెసా 1996, ఎఫ్‌ఆ ర్‌ఏ 2006 చట్టాల అమలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. గ్రామ సభల అనుమతి తీసుకోనే బాధ్యతా దానిదేనని, వీటన్నిం టినీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న సీఎంకు ఆందోళనకారులు ఓ లేఖ రాశారు. పర్సా కోల్‌ బ్లాక్‌ పరిధిలోని సాల్హి, హరిహర్‌పూర్‌, ఫతేపూర్‌లలో మొదలైన భూసేకరణ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. పెసా, ఎఫ్‌ఆర్‌ఏ, భూసేకరణ చట్టాలను ఉల్లంఘించారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న భూసేకరణను ప్రక్రియను రద్దు చేయాలనీ డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply