– ఆరుకోట్ల మందిపై ప్రభావం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)కు గాను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నిల్వపై వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయం తీసు కుంది. 2018-19కిగాను పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు అమల్లో ఉన్నది. ఇందులోంచి ఈ ఏడాది 0.15 శాతం కోత పెట్టడం ద్వారా 8.50 శాతానికి తగ్గించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని ఆర్థికశాఖ ఆమోదించాల్సి ఉంది. 2017-18లో 8.55 శాతం, 2016-17లో 8.65 శాతం గాను, 2015-16లో అత్యధికంగా 8.8శాతంగా వడ్డీ రేటు అందించింది. రూ.12 లక్షల కోట్ల నిధి నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌లో ఆరుకోట్ల మంది క్రియాశీల ఖాతాదారులు ఉన్నారు.
Courtesy Nava Telangana