దమ్ముంటే 370 తిరిగి తెస్తామని చెప్పండి

0
201
  • కాంగ్రెస్‌, ఎన్సీపీలకు ప్రధాని మోదీ సవాల్‌
  • గత ప్రధానులకు సాధ్యం కానిది
  • 56 అంగుళాల ఛాతీ మనిషి చేశాడు
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్య
  • మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీలకు మోదీ సవాల్‌
జల్గావ్‌/భండాకా, అక్టోబరు 13: ఆర్టికల్‌ 370 నిర్వీర్యంపై కాంగ్రెస్‌, ఎన్సీపీ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు.దమ్ముంటే జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ప్రొవిజన్లను తిరిగి తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని ఆ పార్టీలకు సవాల్‌ విసిరారు. జమ్మూకశ్మీరు భూభా గం మాత్రమే కాదని, భారత్‌కు కిరీటమని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితులను సాధారణ స్థితికి తేవడానికి 4నెలల కంటే ఎక్కువ సమయం పట్టదన్నారు. ఆదివారం జల్గావ్‌, భండారా జిల్లా సాకోలీలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. అక్టోబరు 21న జరిగే మహారాష్ట్ర ఎన్నికల ముందు ఇవే మోదీ తొలి సభలు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యంపై ప్రతిపక్షాలు పాకిస్థాన్‌లాగే మాట్లా డుతున్నాయని విమర్శించారు. జమ్మూకశ్మీరు గురించి యావత్‌ దేశం ఆలోచనకు భిన్నంగా ఎన్సీపీ నాయకుల ప్రకటనలు ఉన్నాయన్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ‘ఆర్టికల్‌ 370, 35ఏ’ను తిరిగి తెస్తామని, ఆగస్టు 5 నాటి నిర్ణయా న్ని మారుస్తామని దమ్ముంటే ప్రకటించాలని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు.
ప్రస్తుతం ప్రపం చం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా భారత్‌ మా త్రం పటిష్ఠంగా నిలబడిందని చెప్పారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ఆర్థిక వ్య వస్థను పట్టించుకోలేదని, ఆ లోపాన్ని తమప్రభుత్వం సరిదిద్ది.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.25 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. దేవేంద్ర ఫడణవీస్‌ ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందించిందని కొనియాడారు. రైతులు, పారిశ్రామిక రంగం సహా అన్ని వర్గాల్లో విశ్వాసం పాదుకొల్పిందని, మళ్లీ ఫడణవీ్‌సను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. కాగా, కోల్హాపూర్‌ ప్రచార సభలో మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. జమ్మూకశ్మీరును భారత ప్రధాన స్రవంతిలో కలపడానికి ‘‘56 అంగుళాల ఛాతీ కలిగిన మనిషి’’ చూపిన ధైర్యం గతంలో ఏ ప్రభుత్వానికీ లేకపోయిందని వ్యాఖ్యానించారు.
Courtesy Andhra Jyothy

Leave a Reply